Arijit Singh: అతడు సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. సొంత గ్రామంలో పేద విద్యార్థుల కోసం ఆ సింగర్ ముందడుగు.. ఏం చేశాడంటే..

కేవలం గానంతోనే కాదు.. తన మంచి మనసుతో శ్రోతలకు చేరువయ్యాడు ఈ సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‏తో బీటౌన్ ఇండస్ట్రీలో

Arijit Singh: అతడు సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. సొంత గ్రామంలో పేద విద్యార్థుల కోసం ఆ సింగర్ ముందడుగు.. ఏం చేశాడంటే..
Arjith
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2022 | 11:33 AM

సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అర్జిత్ సింగ్(Arijit Singh). తన అద్భుతమైన గాత్రంతో సినీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సింప్లిసిటికీ కేరాఫ్ అడ్రస్. కేవలం గానంతోనే కాదు.. తన మంచి మనసుతో శ్రోతలకు చేరువయ్యాడు ఈ సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‏తో బీటౌన్ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సింగర్.. ఇప్పుడు తన సొంత గ్రామంలోని పిల్లల కోసం మరో ముందగుడు వేశారు. స్వస్థలంలోని పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యతను తీసుకున్నాడు. పేద విద్యార్థుల కోసం ఉచిత ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన స్వస్థలంలోని ఓ నర్సింగ్ కళాశాలను ఎంచుకున్నాడు. అక్కడ ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన అర్జిత్ కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. భారీగా తరలివచ్చి గాయకుడిని చుట్టుముట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అర్జిత్ సింగ్ స్వస్థలం అయిన ముర్షిదాబాద్‏లోని జియాగంజ్‏లోని స్థానికంగా ఉన్న నర్సింగ్ కాలేజీలో ఉచిత ఇంగ్లీష్ కోచింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులోని గదులను అద్దెకు తీసుకోవడానికి.. ఆ పరిసరాలను పరిశీలించేందుకు సింగర్ అర్జిత్ ఎంతో సామాన్యుడిగా స్కూటీపై కళాశాలకు చేరుకున్నాడు. దీంతో అతడిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు. ఇంగ్లీష్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి గదులు ఖాళీగా ఉన్నాయా అని అర్జిత్ అడిగారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో అతనికి స్థలం ఇచ్చేందుకు నేను ఓకే చెప్పాను. ఇంగ్లీష్ పరిజ్ఞానం, సాహిత్యం, ఇంగ్లీష్ కేంద్రాల కొరత ఉంది. అర్జిత్ నిర్ణయంతో పిల్లలకు మంచి జరుగుతుందని సదరు కళాశాల అధ్యాపకుడు శంకర్ మోండల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?