AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Rahul Jain: సింగర్ రాహుల్ జైన్ పై ఆత్యాచారం కేసు.. పోలీసులను ఆశ్రయించిన అమ్మాయి..

బాధిత మహిళ ఆరోపణలతో సోమవారం సదరు సింగర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తనను ఇన్ స్టాలో కంటాక్ట్ అయ్యారని.. తన పనితనం బాగుందని..

Singer Rahul Jain: సింగర్ రాహుల్ జైన్ పై ఆత్యాచారం కేసు.. పోలీసులను ఆశ్రయించిన అమ్మాయి..
Singer Rahul Jain
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2022 | 11:56 AM

Share

ప్రముఖ బాలీవుడ్ సింగర్.. మ్యూజిక్ కంపోజర్ రాహుల్ జైన్ పై (Singer Rahul Jain) ముంబైలో ఆత్యాచారం కేసు నమోదైంది. బాంబేలోని అతని అపార్ట్మెంట్‏లో తనపై రాహుల్ జైన్ అత్యాచారానికి పాల్పడినట్లు 30 ఏళ్ల మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఆరోపణలతో సోమవారం సదరు సింగర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తనను ఇన్ స్టాలో కంటాక్ట్ అయ్యారని.. తన పనితనం బాగుందని.. తనను వ్యక్తిగత స్టైలిస్ట్‏గా నియమించుకుంటానని చెప్పినట్లు సదరు మహిళ పేర్కొంది. ఇందుకోసం తనను ఒకసారి కలిసి మాట్లాడాలంటూ సబర్బన్ అంధేరిలో ఉన్న తన అపార్ట్మెంట్‏కు రావాలని కరోగా.. తాను వెళ్లానని.. అదే సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా..తనపై దాడి చేశాడని మహిళ ఆరోపించింది. అంతేకాకుండా తన ఇన్ స్టాలోని, ఫోన్ లోని సాక్ష్యాలను సైతం రాహుల్ తొలగించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన ఆగస్ట్ 11న జరిగిందని తెలిపింది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమంటూ సింగర్ రాహుల్ జైన్ చెప్పుకొచ్చారు. తనపై సదరు మహిళ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని.. నిరాధమైనవని అన్నారు. గతంలోని ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోన్నానని.. కానీ ఆ సమయంలో తనకు న్యాయం జరిగిందని.. ప్రస్తుతం తన పై కంప్లైంట్ చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని.. ఇదివరకు తనను చూడలేదంటూ రాహుల్ జైన్ చెప్పారు. గతంలో రాహుల్ తనపై ఆత్యాచారం చేశాడని.. బలవంతంగా అబార్షన్ చేయించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.