SitaRamam: బాక్సాఫీస్ వద్ద సీతారామం వసూళ్ల సునామీ.. స్పెషల్ వీడియోతో థాంక్స్ చెప్పిన దుల్కర్ సల్మాన్..

రామ్, సీతామహాలక్ష్మిల ప్రేమకథతో రూపొందిన ఈ అద్భుతమైన ప్రేమకావ్యం ఆడియన్స్‏ను కట్టిపడేసింది. హనురాఘవపూడి దర్శకత్వం, దుల్కర్ సల్మాన్, మృణాల్ సహజ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

SitaRamam: బాక్సాఫీస్ వద్ద సీతారామం వసూళ్ల సునామీ.. స్పెషల్ వీడియోతో థాంక్స్ చెప్పిన దుల్కర్ సల్మాన్..
Sitaramam
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2022 | 9:06 AM

సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన అందమైన ప్రేమకథ సీతారామం (SitaRamam). మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. రామ్, సీతామహాలక్ష్మిల ప్రేమకథతో రూపొందిన ఈ అద్భుతమైన ప్రేమకావ్యం ఆడియన్స్‏ను కట్టిపడేసింది. హనురాఘవపూడి దర్శకత్వం, దుల్కర్ సల్మాన్, మృణాల్ సహజ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ సక్సెస్‏ఫుల్‍గా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు రాబట్టింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పారు హీరో దుల్కర్ సల్మాన్.

ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా, అక్కినేని సుమంత్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ. 50 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ప్రేమ ఎప్పటికీ ఆపలేనిది అంటూ రామ్ ఆనందంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్ సీతామహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. 1960లో సాగిన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ హానురాఘవపూడి. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో మరోసారి హృదయాలను దొచుకున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.