AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student No.1: స్టూడెంట్ నెంబర్ 1 కోసం మొదట అనుకుంది ఎన్టీఆర్‏ను కాదట.. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..

అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట. మరో హీరోను అనుకున్నారట. ఇటీవల నిర్మాత చలసాని అశ్విని దత్ ప్రముఖ షో ఆలీతో సరదాగాలో పాల్గోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Student No.1: స్టూడెంట్ నెంబర్ 1 కోసం మొదట అనుకుంది ఎన్టీఆర్‏ను కాదట.. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..
Ntr
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2022 | 7:47 AM

Share

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ 1 (Student No.1) చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అటు దర్శకుడిగా జక్కన్నకు (Rajamouli).. ఇటు హీరోగా ఎన్టీఆర్‏కు ఫస్ట్ మూవీ కావడం మరో విశేషం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట. మరో హీరోను అనుకున్నారట. ఇటీవల నిర్మాత చలసాని అశ్విని దత్ ప్రముఖ షో ఆలీతో సరదాగాలో పాల్గోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కోసం ముందుగా ప్రభాస్‏ను కథానాయికుడిగా ఎంపిక చేసుకున్నారట. కానీ దివంగత నటుడు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ తన కుమారుడిని ఈ సినిమాతో లాంచ్ చేయాలని కోరడంతో తన నిర్ణయం మార్చుకున్నారని.. దీంతో తారక్ ఈ సినిమాలో హీరోగా నటించారని తెలిపారు. తాము అనుకున్న దానికన్నా.. తారక్ అద్భుతంగా నటించారని అన్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించగా.. 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తమిళంలో అదే టైటిల్‏తో 2003లో రీమేక్ అయ్యింది. ఇక ప్రభాస్ తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కె గురించి స్పందిస్తూ.. ఇప్పటివరకు 55 శాతం షూటింగ్ పూర్తైందని అన్నారు. అవెంజర్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె నటిస్తుండగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?