Dhanush: ఆ ఒక్క సినిమా కోసం ధనుష్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా..

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం ధనుష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Dhanush: ఆ ఒక్క సినిమా కోసం ధనుష్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా..
Dhanush
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2022 | 8:16 AM

తమిళ్ స్టార్ హీరో ధనుష్‏కు (Dhanush) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెప్పించాడు ఈ హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి జాతీయ అవార్డు అందుకున్న ఈ నటుడు హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించి తిరుచిత్రంబలం ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం ధనుష్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. డైరెక్టర్ మిత్రన్ జవహర్ తెరకెక్కించిన తిరుచిత్రంబలం సినిమా కోసం ధనుష్ ఏకంగా రూ. 12 నుంచి 15 కోట్ల వరకు వసూళు చేసినట్లుగా సమాచారం.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తిరుచిత్రంబలం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలిపారు. ఇప్పటికే శింబు, శివకార్తికేయన్, కార్తీలు తమ లేటేస్ట్ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ నుంచి రాబోయే తిరుచిత్రంబలం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హాలీవుడ్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన ది గ్రే మ్యాన్ సినిమా కోసం ధనుష్ రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో తన ఒక్కో సినిమా కోసం హీరో రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడట. అలాగే ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం 2019లో ధనుష్ సంపాదన రూ. 31.75 కోట్లు. ఇక తాజా సమాచారం ప్రకారం 2022లో అతని నికర విలువ దాదాపు రూ.160 కోట్లు అని తెలుస్తోంది. చెన్నైలోని పోయెస్ గార్డెన్‏లో హీరోకు రూ. 25 కోట్ల విలువైన ఇల్లు ఉంది. అంతేకాకుండా అతని వద్ద నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి. అతని కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ (విలువ రూ. 6.95 కోట్లు), రేంజ్ రోవర్ స్పోర్ట్ హెచ్‌ఎస్‌ఇ (విలువ రూ. 1.50 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ ఎస్ 350 (విలువ రూ. 1.42 కోట్లు) , జాగ్వార్ ఎక్స్‌జె ఎల్ (విలువ రూ. 1.11 కోట్లు) ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.