Viral Photo: తన సంగీతంతో ప్రపంచాన్నే మైమరపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టండి.. అతడి మ్యూజిక్‎కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతడే ఓ బ్రాండ్. ప్రతి సినీ ప్రియుడి మనసును చేరుకోవడంలో అతడి దారే వేరు. తన నుంచి వచ్చే ప్రతి సాంగ్ ఆల్ టైమ్ సూపర్ హిట్.

Viral Photo: తన సంగీతంతో ప్రపంచాన్నే మైమరపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టండి.. అతడి మ్యూజిక్‎కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..
Viral Photo
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 16, 2022 | 10:08 AM

సంగీతంతో ప్రపంచాన్నే మాయ చేస్తాడు. తన మ్యూజిక్‏తో ఎంతో మంది శ్రోతల హృదయాలను గెలుచుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఏ తరమైన అతడి పాటలకు ఫిదా కావాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ కుర్రాడి పాటలు వింటూ ఉండిపోవాల్సిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతడే ఓ బ్రాండ్. ప్రతి సినీ ప్రియుడి మనసును చేరుకోవడంలో అతడి దారే వేరు. తన నుంచి వచ్చే ప్రతి సాంగ్ ఆల్ టైమ్ సూపర్ హిట్. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో అతని పాటల సందడి తగ్గినప్పటికీ.. క్రేజ్ మాత్రం తగ్గడం లేదనే చెప్పుకొవాలి. ఇప్పటికీ అతని నుంచి వచ్చే సాంగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎవరో గుర్తుపట్టండి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఎవరికీ దక్కని రికార్డులను.. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన కంపోజ్ చేసే ప్రతి పాట సినిమాను మరో లెవల్‏కు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు. గుర్తుపట్టారు అనుకుంటా.

పైన ఫోటోలో ఉన్న ఆ కుర్రాడు మరెవరో కాదు.. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. రోజా సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఏఆర్ రెహమాన్ ఫస్ట్ మూవీతోనే సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. మణిరత్నం, శంకర్ సినిమాలలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేసి మెప్పించాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఏడాదిలో 2 ఆస్కార్ అవార్డులు గెలుచున్న మొదటి భారతీయుడు. అంతేకాకుండా పద్మభూషణ్, పద్మ శ్రీతోపాటు 4 జాతీయ అవార్డులను అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర స్వరకర్తలలో రెహమాన్ ఒకరు. జెంటిల్ మెన్, రోబో, జీన్స్, ప్రేమదేశం, సఖి, నీ మనసు నాకు తెలుసు, నానీ, ప్రేమికుడు వంటి చిత్రాలకు ఆయన కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఆయన తొలి చిత్రం రోజా నిన్నటితో 3 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెహమాన్ తన ట్విట్టర్ ఖాతాలో చిన్ననాటి ఫోటో షేర్ చేసుకుంటూ 50 సంవత్సరాల క్రితం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. క్యూట్‏గా.. అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నోడు.. ఇప్పుడు ప్రపంచాన్ని తన మ్యూజిక్‏తో మాయ చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.