Tollywood: నిజ జీవితంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. నటనపై ఇష్టంతో సినిమాల్లోకి.. ఆ హీరో ఎవరంటే..
అతడు నిజానికి పోలీస్ ఆఫీసర్. డీఎస్పీగా పదోన్నతి పొందిన వ్యక్తి. కానీ సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. నటనపై ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అటు సినిమాలు చేస్తునే.. ఇటు పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం అటు భోజ్ పురి చిత్రాాల్లో నటిస్తూ ఫుల్ బిడీగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.

సినిమా పట్ల అపారమైన ఇష్టంతో ఒక్క మూవీ అయిన చేయాలని అనుకుంటారు. సినిమాలో పేరు తెచ్చుకుని ఒక్క సన్నివేశంలోనైనా నటించాలని అనుకుంటారు. కానీ జీవిత పరిస్థితుల కారణంగా కొందరు ఆ కలను కొనసాగించలేక చివరికి ఇతర ఉద్యోగాలకు పరిమితమవుతుంటారు. సినిమా రంగంలోనే కాదు, తాము కోరుకున్న రంగంలోకి రాలేక వేరే ఉద్యోగాలకు వెళ్లాల్సిన చాలా మందిని మనం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం నచ్చిన ఉద్యోగం చేస్తూ ఇటు ఇష్టమైన సినిమాల్లో కొనసాగుతున్నాడు. నిజ జీవితంలో అతడు డీఎస్పీ. కానీ సినిమాల్లో హీరో. అతడి పేరు ఆనంద్ కుమార్ ఓజా (45).
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అతడు రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కానీ భోజ్ పురి సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనేది అతని కల. అతను స్కూల్లో ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా ముంబై వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఏమాత్రం నిరుత్సాహపడకుండా, కాలేజీలో చదువుతున్నప్పుడు ముంబైకి తిరిగి వచ్చాడు. కానీ అప్పటికి కూడా అతనికి సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. 40 సంవత్సరాల వయసులో తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు.
“సినిమా పట్ల నాకున్న మక్కువ కారణంగా, నేను స్కూల్లో ఉండగానే కేవలం 20 రూపాయలతో ఇంటి నుండి ముంబైకి బయలుదేరాను. నా దగ్గర టికెట్ లేకపోవడంతో ఒక రైల్వే ఉద్యోగి నన్ను వెనక్కి పంపించాడు. నా పట్టుదల చూసి, నా స్నేహితులు 500 రూపాయలు వసూలు చేసి ముంబైకి పంపారు. అక్కడ, నేను వాచ్‌మెన్‌గా పనిచేశాను. ప్రతి స్టూడియోలో అవకాశాల కోసం వెతుకుతూ తిరిగాను. కానీ నాకు ఎటువంటి అవకాశం రాలేదు. నాన్న నన్ను తిరిగి మా ఊరికి తీసుకువచ్చాడు. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్నాడు. ఆ సమయంలో వారణాసిలో పోలీసు ఉద్యోగాలకు పరీక్ష ఉందని నా స్నేహితులు నాకు చెప్పారు. కానీ వారణాసి వెళ్ళాక నా ఆలోచనలు మారిపోయాయి.
నాన్న కోరిక తీర్చి, నేను కూడా పరీక్ష రాసి పాసయ్యాను. నేను మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ భద్రతలో ఉన్నప్పుడు, నేను ఆయనతో కలిసి ముంబైకి వచ్చాను. అప్పుడు నేను భోజ్‌పురి చిత్ర నిర్మాత నిర్మల్ పాండేను కలిశాను. అతడి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అంటూ ఓజా చెప్పుకొచ్చారు. భోజ్ పురి సినిమాల్లో నటిస్తూ ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నాడు. అలాగే అటు పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..