Tollywood: అభిమానుల కోసం స్టార్ హీరో సంచలన నిర్ణయం.. కోట్ల విలువైన ఇంటిని..
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించి ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్చర్స్ అంటూ తమకు ఇష్టమైన నటీనటుల విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోకు సంబంధించిన క్రేజీ న్యూస్ తెగ వైరలవుతుంది.

నటుడు మమ్ముట్టి మలయాళీలకు ఇష్టమైన నటుడు. ఈ హీరోకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవిత వివరాలను తెలుసుకోవడానికి, ఆస్తులు, లైఫ్ స్టైల్, ఇళ్లు, వాహనాలు సైతం సోషల్ మీడియాలో కూడా దృష్టిని ఆకర్షించాయి. ఆ స్టార్ కు కేరళ, చెన్నై, విదేశాలలో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా మమ్ముట్టి.. తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు. కేరళలో చాలా అరుదుగా ఉంటారు. కేరళలోని కొచ్చిలోని పనంపల్లి నగర్‌లో మమ్ముట్టికి కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ ఇంటి ఫోటోస్, వీడియోస్ ఇప్పటికే అనేకసార్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
నాలుగేళ్ల క్రితం వరకు మమ్ముట్టి కుటుంబం ఈ నివాసంలోనే నివసించింది. కానీ తరువాత, వైట్టిల జనతాలోని అంబెలిపాడు రోడ్డులో కొత్త ఇల్లు నిర్మించినప్పుడు, కుటుంబం అక్కడికి మారింది. మమ్ముట్టి, అతని కుటుంబం ఇప్పుడు కొచ్చిలోని పనంపల్లి నగర్‌లోని తమ ఇంటిని తమ అభిమానుల కోసం రిసార్ట్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ నివాసాన్ని ప్రజలు తమ సెలవులను జరుపుకోవడానికి మమ్ముట్టి రిసార్ట్ మోడల్‌గా మార్చనున్నారట. ఈ ఇల్లు బోటిక్ విల్లా మోడల్‌లో నిర్మించబడింది. ఇక్కడ బస చేయడానికి బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.
ఇందులో సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో కొందరు మమ్ముట్టి నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తుండగా..మరికొందరు మమ్ముట్టి ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మమ్ముట్టి ప్రస్తుతం మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి నటించడం విశేషం. వీరితో పాటు, ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార వంటి భారీ తారలు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..