AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Betting Apps: బెట్టింగ్ పాపం తలాపిడికెడు! ఇండస్ట్రీపై పడ్డ మరక మంచిదేనా..?

పైసలకు ఆశపడి ముందూ వెనుకా చూసుకోకుండా అనాకారీ కంపెనీలకు సపోర్ట్ ఇచ్చి నాలిక్కర్చుకుంటున్న చిన్నాచితకా సెలబ్రిటీల పక్కనే.. బిగ్‌సైజ్ హీరోలు, హీరోయిన్ల పేర్లు కూడా కనబడ్డం అంటే.. అది తెలుగు సినిమా పరిశ్రమకు తలవొంపులేగా..? ఇండస్ట్రీపై పడ్డ ఈ మరక మంచిదేనా.. తర్వాతైనా మాసిపొయ్యే ఛాన్సుందా..?

Betting Apps: బెట్టింగ్ పాపం తలాపిడికెడు! ఇండస్ట్రీపై పడ్డ మరక మంచిదేనా..?
Betting Apps
Balaraju Goud
|

Updated on: Mar 20, 2025 | 9:55 PM

Share

దేశం కోసం కంటెంట్ క్రియేట్ చేయండి.. దేశం కోసం మరిన్ని లైక్స్ కొట్టించండి.. ప్రపంచం ఎదుట దేశాన్ని గర్వంగా నిలబెట్టండి..! టాలెంట్ హంట్‌ పేరుతో దేశమంతా గాలించి 23 మంది టాప్‌మోస్ట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను వెతికిపట్టి.. ఇన్‌ఫ్లుయెన్సర్లంటే మీరే అని పొగడ్తలతో ముంచెత్తి.. ఇటీవలే తన చేతుల మీదుగా అవార్డులు కూడా ప్రదానం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కానీ.. ఇన్‌ఫ్లుయెన్సర్లు అనే అందమైన ముసుగు తన్ని.. చాలామంది సోకాల్డ్ యూట్యూబర్లు చేస్తున్న అసలైన ఇన్‌ఫ్లుయెన్స్ ఏంటో తెలిసింతర్వాత.. మైండ్ బ్లాంకవుతోంది…! ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో..! కాయ్‌ రాజా కాయ్‌… బెట్టింగ్‌లోనే ఉంది భలే మజా.. దాన్ని కనుక మిస్సయితే బాధపడ్డమే కదా.. అని ఆన్‌లైన్‌ జూదాన్ని అఫీషియల్‌గా మార్చేసిన యూట్యూబర్లు ఒక్కరొక్కరుగా బోనెక్కుతున్నారు. మీరు ఫ్రెష్షర్స్ ఐతే బెట్టింగ్ ఆడ్డం రాకపోతే..చెయ్యిపట్టించి ఆడించడానికి మేమున్నాం, గుడ్డిగా మమ్మల్ని ఫాలో అవ్వండి.. అని పచ్చిపచ్చిగా ప్రమోషన్లు చేసి.. అమాయక ఫాలోయర్లను బెట్టింగ్‌ ఊబిలోకి దింపిన పాపానికి కొద్దికొద్దిగా పరిహారం చెల్లించుకుంటున్నారు.. సోకాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్ పూనుకోబట్టి పంజాగుట్ట పోలీసులు జూలు విదల్చబట్టి కేసులు, నోటీసులు, విచారణలంటూ డొంక స్పీడుగానే కదులుతోంది. హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్‌, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి, ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇదీ ఫస్ట్ బంచ్ ఆఫ్ యూట్యూబర్ల మూక. కొందరైతే.. ‘తెలీకచేశాం వదిలిపెట్టండి మహాప్రభో..’ అని ఆరున్నొక్క రాగం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి