Tollywood: 10కి పైగా డిజాస్టర్ మూవీస్.. సొంతంగా దీవి ఉన్న ఏకైక హీరోయిన్.. బ్యాగ్రౌండ్ తెలిస్తే..
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ విజేత ఆమె.. ఆ తర్వాత 2009లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనేక చిత్రాల్లో నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. 2012 లో శ్రీలంకలో ఒక ద్వీపాన్ని కొన్న ఆ నటి ఎవరో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఆమె స్పెషల్ పాటలతోనే చాలా పాపులర్ అయ్యింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతోనే చాలా ఫేమస్ అయ్యింది. కానీ హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత 2009 ఫాంటసీ కామెడీ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు.. కానీ అందం, అభినయంతో కట్టిపడేసింది. సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన హీరోయిన్.. ఇప్పుడు సొంతంగా దీవి కూడా ఉంది. ఆమె మరెవరో కాదు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అలాద్దీన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మర్డర్ 2, హౌస్‌ఫుల్ 2, రేస్ 2 మరియు కిక్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది.
జాక్వెలిన్.. దక్షిణ తీరంలో ఉన్న నాలుగు ఎకరాల ద్వీపాన్ని 2012లో దాదాపు రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ ద్వీపం శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కర యాజమాన్యంలోని మరొక ప్రైవేట్ ద్వీపానికి సమీపంలో ఉంది. ఇది లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు ప్రధాన గమ్యస్థానంగా మారింది. ఈ ద్వీపంలో ఆమె ఒక విల్లా నిర్మించాలని.. దానిని పర్సనల్ గెస్ట్ హౌస్ గా మార్చుకోవాలని చూస్తుందట. నివేదికల ప్రకారం జాక్వెలిన్ ఆస్తులు రూ.116 కోట్లు. సంవత్సరానికి రూ.15 కోట్లకు పైగా సంపాదిస్తుందట.
2017లో జుడ్వా 2 సినిమాతో చివరిసారిగా హిట్ ఇచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గత ఎనిమిదేళ్లుగా వరుస బాక్సాఫీస్ పరాజయాలను ఎదుర్కొంటోంది. డ్రైవ్, రాధే, భూత్ పోలీస్, బచ్చన్ పాండే, ఎటాక్, రామ్ సేతు, సర్కస్, ఫతే సినిమాలు ప్లాప్ అయ్యాయి. జాక్వెలిన్ తన తదుపరి చిత్రం హౌస్‌ఫుల్ 5 కోసం సిద్ధమవుతోంది. ఇందులో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, డినో మోరియా, ఫర్దీన్ ఖాన్, సోనమ్ బజ్వా, చంకీ పాండే కీలకపాత్రలలో కనిపించనున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..