AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: జీవితాంతం ప్రేమ కోసం పోరాడింది.. 15 ఏళ్లల్లో ఒక్క సినిమా చేసింది.. రిలీజ్ కాగానే..

సినీరంగంలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆమె ఒక్క సినిమా చేయడానికే 15 ఏళ్లు పట్టింది. కానీ తన ఫస్ట్ మూవీ విడుదల కాగానే ఊహించని రితీలో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా... ఆమె జీవితం మొత్తం ప్రేమ, ఆప్యాయత కోసమే పోరాడింది.

Tollywood: జీవితాంతం ప్రేమ కోసం పోరాడింది.. 15 ఏళ్లల్లో ఒక్క సినిమా చేసింది.. రిలీజ్ కాగానే..
Meena Kumari
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2025 | 9:01 PM

Share

సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మూవీనే 1972లో విడుదలైంది. ఇది థియేటర్లలో భారీ జనసమూహాన్ని ఆకర్షించింది. ఆ సినిమా చాలా నెలలు థియేటర్లలో ఆడింది. ఆ సినిమా పేరు పకీజా. ఫిబ్రవరి 4, 1972న విడుదలైన కేవలం 2 నెలల తర్వాత అందులో నటించిన మీనా కుమారి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇది ఆమె అభిమానులను తీవ్రంగా ప్రభావితం చేసింది. బాలీవుడ్ ‘ట్రాజెడీ క్వీన్’ మీనా కుమారి వ్యక్తిగత జీవితం ఎంత బాధాకరంగా ఉందో, ఆమె సినీ జీవితం కూడా అంతే విజయవంతమైంది. తెరపై ప్రతి పాత్రలోనూ తన ఆత్మను, మనసును అంకితం చేసింది మీనా కుమారి. కానీ జీవితాంతం ప్రేమ కోసమే పోరాడింది. మీనా కుమారి తనకంటే 37 సంవత్సరాలు పెద్దవాడైన చిత్రనిర్మాత కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. కానీ అప్పటికే అతడికి పెళ్లైపోయింది.

కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో దుఃఖం, వేదన తప్ప మరేమి లభించలేదు. మీనా కుమారి నటించిన ఐకానిక్ చిత్రం ‘పకీజా’ను నటి భర్త కమల్ అమ్రోహి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తీయడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు కాదు, దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. కమల్ అమ్రోహి, మీనా కుమారి మధ్య సంబంధాలు క్షీణించడమే ‘పకీజా’ ఆలస్యానికి కారణమని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో మీనా కుమారి, కమల్ అమ్రోహి విడిపోయారు. ఆ తర్వాత, ఆమె ఆ దర్శకుడితో పనిచేయడానికి ఇష్టపడలేదు. దీనితో పాటు, సినిమా షూటింగ్ సమయంలో నటి ఆరోగ్యం సైతం క్షీణించింది. , కానీ దర్శకుడి నుండి అనేక అభ్యర్థనల తర్వాత ఆమె ఈ సినిమాలో పనిచేయడానికి అంగీకరించింది.

‘పకీజా’ విడుదలైన రెండు నెలలకే మీనా కుమారి మరణించారు. తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను మరచిపోవడానికి ఆమె మద్యానికి బానిసైంది. దీంతో ఆమె అనారోగ్యానికి గురైంది. పకీజా సినిమా విడుదలైన రెండు నెలలకే ఆమె ప్రాణాలు విడిచింది. 1972లో విడుదలైన ‘పకీజా’ మీనా కుమారి చివరి చిత్రం.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన