Tollywood: అభిమాని చేసిన పనికి ఖంగుతిన్న హీరోయిన్.. సెల్ఫీ కోసం వచ్చి ఏకంగా..
సాధారణంగా సినీతారలకు అభిమానుల నుంచి చాలా సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫీల కోసం వచ్చి హీరోయిన్లను ఇబ్బందులకు గురి చేస్తుంటారు పలువురు ఆకతాయిలు. తాజాగా ఓ హీరోయిన్ కు సైతం ఊహించని షాకిచ్చాడు ఓ అభిమాని.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ ఆమె. కానీ కొన్నాళ్లుగా ఆమె క్రేజ్ పూర్తిగా పడిపోయింది. ఇక ఆ తర్వాత ఎప్పుడూ వివాదాలతోనే వార్తలలో నిలిచింది. తాజాగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని చేసిన పనికి షాకయ్యింది. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ పూనమ్ పాండే. ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాలతో వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముంబై వీధుల్లో పూనమ్ పాండేను ఓ అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పూనమ్ పాండే భయపడి పక్కకు తప్పుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.
తాజాగా ముంబై వీధుల్లో కనిపించిన పూనమ్ పాండేను పాపరాజ్జీలు ఫోటోస్ తీయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఓ అభిమాని వచ్చి పూనమ్ తో సెల్ఫీ కావాలని అడిగాడు. దీంతో ఆమె అంగీకరించింది. పూనమ్ పాండే కూడా ఒక అడుగు దూరం నుండి సెల్ఫీ తీసుకోవడానికి ఒప్పుకుంది. కానీ ఆ వ్యక్తి మరింత దగ్గరగా వచ్చి పూనమ్ కు ముద్దు పెట్టేందుకు ప్రవర్తించాడు. అప్పుడు పూనమ్ పాండే భయంతో వెనక్కు జరిగింది.
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన డ్రామా అని కొందరు అంటున్నారు. ఈ డ్రామా ముందుగానే ప్లాన్ చేసుకున్నదని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.పూనమ్ పాండే నాటకం ఒకటి రెండు కాదు. అంతకుముందు, అతనే తన మరణానికి సంబంధించిన నకిలీ వార్తలను ప్రచారం చేసింది.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








