Horror Movie: ఈ సినిమాను అస్సలు మిస్ కావొద్దు.. రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్లు వచ్చాయి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ మధ్య కాలంలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం అలాంటి జానర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పుడు ఓటీటీల్లో ఎక్కువగా హారర్ జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

తమిళంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ హీరో జీవా, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఆ సినిమా డార్క్. టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు కేజీ సుబ్రమణి దర్శకత్వం వహించారు. తమిళంలో కేవలం రూ.5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా రాబట్టింది. హీరో జీవా కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికి వస్తే.. వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. ఆఫీస్ కు హాలీడేస్ రావడంతో బీచ్ దగ్గర్లో తాము కొత్తగా కొన్న విల్లాలోకి సరదాగా గడపాలని ప్లాన్ చేస్తారు. అయితే ఎదురుగా ఉన్న విల్లాలో అచ్చం తమ పోలికలతోనే ఉన్నవారిని చూసి షాకవుతారు. అలాగే ఆ విల్లాలో వీరిద్దరి అనుహ్య పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించిన సమయంలో వారికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. అనుకోకుండా అరణ్య కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ? అసలు అరణ్య ఎక్కడికి వెళ్లిపోయింది ? అనేది సినిమా.
టైమ్ లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా చివరి వరకు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ పంచుతుంది. కథలో ముందుకు వెళ్తున్న కొద్ది ఇదొక హారర్ మూవీ అనే ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








