Triptii Dimri: వార్నీ.. ఈ అమ్మడు ఆస్తులు తెలిస్తే షాకే.. ఒక్కో సినిమాకు త్రిప్తి రెమ్యునరేషన్ ఏంతంటే..

ఇటీవలే బ్యాడ్ న్యూజ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్. హిందీలో వరుస సినిమాలతోపాటు తెలుగులోనూ పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసేందుకు రెడీ అయ్యిందట ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిప్తి ఆస్తులు, రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట వైరలవుతున్నాయి.

Triptii Dimri: వార్నీ.. ఈ అమ్మడు ఆస్తులు తెలిస్తే షాకే.. ఒక్కో సినిమాకు త్రిప్తి రెమ్యునరేషన్ ఏంతంటే..
Triptii Dimri
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2024 | 12:58 PM

కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ హాట్ ఫేవరేట్‏గా మారిపోయింది త్రిప్తి డిమ్రీ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తైన.. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాతోనే తెగ పాపులర్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీలో జోయా పాత్రలో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో నేషనల్ క్రష్‏గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ మూవీ తర్వాత ఇన్ స్టాలో త్రిప్తి ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగారు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే బ్యాడ్ న్యూజ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్. హిందీలో వరుస సినిమాలతోపాటు తెలుగులోనూ పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసేందుకు రెడీ అయ్యిందట ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిప్తి ఆస్తులు, రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట వైరలవుతున్నాయి.

2023 సంవత్సరం త్రిప్తి కెరీర్‏ను మలుపుతిప్పింది. గతేడాది విడుదలైన యానిమల్ చిత్రం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ మూవీలో జోయా పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి.. నికర విలువ రూ.20 నుంచి 30 కోట్ల మధ్య ఉంటుందట. కేవలం సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర ప్రాజెక్ట్‌ల నుండి ఆదాయం వచ్చే అవకాశం ఉందట. యానిమల్ తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం త్రిప్తికి ఇన్ స్టాలో 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. యానిమల్ సినిమాకు రూ.40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న త్రిప్తి.. ఇప్పుడు బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 3 చిత్రాలకు దాదాపు రూ.80 లక్షల రూ. కోటి వరకు వసూలు చేస్తోందని టాక్.

ఇవి కూడా చదవండి

అలాగే ఇన్ స్టాలో ఒక్క బ్రాండ్ పోస్ట్ కోసం రూ.60 నుంచి 90 లక్షలు తీసుకుంటుందట. ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఒకటైన బాంద్రాలో విలాసవంతమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టింది. గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల భవనం విలువ రూ.14 కోట్లు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ జోడిగా భూల్ భూలయ్యా 3 చిత్రంలో నటిస్తుంది. అలాగే ధడక్ 2లోనూ నటిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.