Tollywood : ఈ పిల్లకాయలు గుర్తుపట్టరా..? టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.

ఇప్పటికీ కొంతమంది అమృతం సీరియల్ పాటను పాడుతూ ఉంటారు. ఎంతో మందికి ఫెవరెట్ ఆయిన అమృతం సీరియల్ లో చాలా మంది నటించారు. అలాగే ఆ సీరియల్ లో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కూడా నటించారు. అలాగే పైన కనిపిస్తున్న పిల్లకాయలు చూశారా.?

Tollywood : ఈ పిల్లకాయలు గుర్తుపట్టరా..? టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 14, 2024 | 1:14 PM

చిన్న తనంలో మనం ఎక్కువ చూసిన సీరియల్స్ లో అమృతం ఒకటి. 90కిడ్స్ ఎప్పటికీ మర్చిపోలేని సీరియల్ ఇది. ఈ కామెడీ సీరియల్ టైటిల్ సాంగ్ కు కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పటికీ కొంతమంది అమృతం సీరియల్ పాటను పాడుతూ ఉంటారు. ఎంతో మందికి ఫెవరెట్ ఆయిన అమృతం సీరియల్‌లో చాలా మంది నటించారు. అలాగే ఆ సీరియల్ లో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కూడా నటించారు. పైన కనిపిస్తున్న పిల్లకాయలు చూశారా.? ఆ ఇద్దరూ ఇప్పుడు టాలీవుడ్ లో తోపులు.. అమృతం సీరియల్ లో నటించిన ఆ ఇద్దరిలో ఓ హీరో కూడా ఉన్నాడు. మరొక బుడ్డోడు మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా రాణిస్తున్నాడు. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

అమృతం సీరియల్ లో నటించిన ఆ పిల్లలు ఎవరో కాదు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కొడుకులు. శ్రీ సింహ, కాలభైరవ. ఇక 2007లో యమదొంగ చిత్రంలో బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు శ్రీ సింహ.  ఆతర్వాత 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమా ద్వారా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆతర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ సినిమాల్లో నటించాడు. తాజాగా మత్తువదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

అలాగే ఈ ఫొటోలో ఉన్న మరో బుడతడు కాలభైరవ. తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాటలు పాడాడు భైరవ .‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు కాలభైరవ. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా మత్తు వదలరా, కలర్ ఫోటో, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి, లక్ష్య, బ్లడీ మేరీ,హ్యాపీ బర్త్‌డే, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం, భాగ్ సాలే, కృష్ణమ్మ ఇప్పుడు మత్తువదలరా 2 సినిమాలకు సంగీతం అందించాడు.

ఇది కూడా చదవండి :మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.