AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: “తారక్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు.. నా వల్ల కాలేదు”.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్

ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ కానీ వారు ఉండరు. సినీ సెలబ్రెటీలు కూడా చాలా మంది ఆయనకు ఫ్యాన్స్.. సినీ సెలబ్రేటీలు చాలా మంది తారక్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అభిమానిస్తుంటారు. ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు.

NTR: తారక్ నన్ను పట్టుకొని గంటసేపు  ఏడ్చాడు.. నా వల్ల కాలేదు.. ఎమోషనల్ అయిన రాజేంద్ర ప్రసాద్
Ntr
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2024 | 1:34 PM

Share

ఎన్టీఆర్.. ఆ పేరు చెప్తేనే ఫ్యాన్స్ కు పూనకాలే.. స్క్రీన్ మీద తారక్ కనిపిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. నటనలో ,  డాన్స్ లో, డైలాగ్ డెలివరీలో తారక్ నెక్స్ట్ లెవల్ అంతే.. ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ కానీ వారు ఉండరు. సినీ సెలబ్రెటీలు కూడా చాలా మంది ఆయనకు ఫ్యాన్స్.. సినీ సెలబ్రేటీలు చాలా మంది తారక్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు. సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అభిమానిస్తుంటారు. ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన అందరితో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో అనే గర్వం ఎక్కడా చూపించారు ఎన్టీఆర్. చిన్న చిన్న ఆర్టిస్ట్ లతో కూడా ఎంతో కలివిడిగా మాట్లాడుతుంటాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి రాజేంద్రప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమా చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. ఈ సినిమా కు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈసినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో..

ఇది కూడా చదవండి :Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..

రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ ఎవరు.. పెద్దాయన మనవడు.. అంటే నాకు ఏమవుతాడో అందరికి తెలుసు. ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు. నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతాను. ఆ సీన్ లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకొని గంటసేపు ఏడ్చాడు. మేము ఎంతో ఎమోషనల్ అయ్యాము. ఎన్టీఆర్ ను మేము ఓదార్చలేకపోయాం. నా వల్ల కాలేదు. అయ్యో నాన్న నేను ఇక్కడే ఉన్నాగా.. అని చెప్పిన కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎంతో ఎమోషనల్ అయ్యాడు. మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు.. మా రిలేషన్ కూడా అలాంటిదేగా అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.