Telugu Cinema : ఇద్దరు పిల్లల తల్లి.. రెండుసార్లు విడాకులు.. 47 సంవత్సరాల వయసులో మళ్ళీ పెళ్లి…
చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అలాగే కొందరు సినీతారలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని.. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తూ మరోసారి సినీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

సినీరంగంలో సహజ నటనతో తమదైన ముద్రవేసిన తారలు చాలా మంది ఉన్నారు. అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు తీసుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 47 ఏళ్ల నటి.. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె పేరు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇద్దరు పిల్లల తల్లి, రెండుసార్లు విడాకులు.. ఇక ఇప్పుడు మూడోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆమె పేరు దీప్సిఖా నాగ్ పాల్. తన వ్యక్తిగత జీవితం కారణంగా మళ్లీ వార్తలలో నిలిచింది. బాద్ షా, పార్టనర్, దిల్లగి, సిరాఫ్ తుమ్ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వివాహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ప్రస్తుతం దీప్సిఖా వయసు 47 సంవత్సరాలు. చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. కానీ ఈసారి కొన్ని షరతులు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. దీప్సిఖా 1997లో నటుడు ఉపేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె 2012లో కేశర్ అరోరాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి బంధం సైతం ఎక్కువ కాలం సాగలేదు. 2016లో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
రెండో భర్తతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటుంది దీప్సిఖా. ప్రస్తుతం టీవీ సీరియల్స్ ద్వారా బిజీగా ఉంటున్న ఆమె.. తన వ్యక్తిగత జీవిుతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ప్రేమ పట్ల ఎప్పుడూ తాను జాగ్రత్తగా ఉంటానని.. ఆ జాగ్రత్తతోనే ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








