AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: యాక్టర్ అవుతానని నితిన్ చెప్పాడు.. నా సపోర్ట్ ఉండదని చెప్పేశా.. ఎన్టీఆర్..

భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన మ్యాడ్ స్క్వేర్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న రిలీజ్ అయి థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తున్న అటు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Jr.NTR: యాక్టర్ అవుతానని నితిన్ చెప్పాడు.. నా సపోర్ట్ ఉండదని చెప్పేశా.. ఎన్టీఆర్..
Jr.ntr, Narne Nithiin
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2025 | 8:45 AM

Share

ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తున్న ఈ చిత్రం, భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకుంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “అభిమాన సోదరులందరికీ నమస్కారం. చాలాకాలం అయిపోయింది మిమ్మల్ని ఇలా కలిసి. ఈరోజు నాగవంశీ పుణ్యాన మనం ఇలా కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపించింది. గీత్ ని, వాళ్ళన్నయ్య సంతోష్ ని చూస్తే.. నాకు వాళ్ళ గారు శోభన్ గారే గుర్తుకొస్తారు. నేను శోభన్ గారిని ఒకసారి కలిశాను. ఆయనంత హంబుల్ గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. శోభన్ గారు మన మధ్యే ఉండి, సంగీత్ సక్సెస్ ని చూసి గర్వపడుతున్నారు అనుకుంటున్నాను” అని అన్నారు.

“నాకు 2011 లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యం చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. వెంటనే నేనూ అంతే ధైర్యంగా నా సపోర్ట్‌ ఉండదని చెప్పేశా. నేను నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..