Tollywood: 32 సినిమాలు.. కట్ చేస్తే.. UPSC పాసై కలెక్టర్ అయిన క్రేజీ హీరోయిన్..
సినీరంగంలో ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. కట్ చేస్తే.. UPSC పాసై ఇప్పుడు కలెక్టర్గా విధులు నిర్వహిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె సినీప్రయాణం, పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సినీరంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వరుస సినిమాలతో దూసుకుపోయింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెరపై 48 షోలలో పాల్గొంది. ఇండస్ట్రీలో దాదాపు 32 సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు కలెక్ట్. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే నటనకు గుడ్ బై చెప్పి UPSC ఎగ్జామ్ రాసి పాసై ఇప్పుడు IASగా విధులు నిర్వహిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హెచ్.ఎస్. కీర్తన. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని హోసకేరె గ్రామంలో జన్మించింది. కేవలం 4 ఏళ్ల వయసులోనే నటన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కర్పుర్దా గొంబే సినిమాతో నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె దాదాపు 30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలలో కనిపించింది. ‘గంగ-యమున’, ‘హబ్బా’, ‘లేడీ కమిషనర్’, ‘పుట్టని ఏజెంట్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
నటిగా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె నటనకు గుడ్ బై చెప్పాలనుకుంది. 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (KAS) పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. రెండేళ్లు అధికారిగా పనిచేసింది. ఆమె కోరిక యూపీఎస్సీ పాసై ఐఎఎస్ అధికారిణి కావడమే. వరుసగా ఐదు సార్లు UPSC ఎగ్జామ్ రాసి విఫలమైంది. చివరకు ఆరో ప్రయత్నంలో ఆమె IAS ఆఫీసర్ అయ్యింది. UPSCలో 167 AIR (ఆల్ ఇండియా ర్యాంక్ ) సాధించింది. కీర్తన మొదటి నియామకం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా జరిగింది.

Kannada Actress Keerthana
వెండితెరపై నటిగా దూసుకుపోతున్న సమయంలోనే కీర్తన తన కోరిక వైపు అడుగులు వేసింది. ఫెయిల్యూర్ ఎదురైన అంగీకరించి తిరిగి ప్రయత్నిస్తూ చివరకు గమ్యాన్ని చేరుకుంది. ఎంత పెద్ద కల అయినా, దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె ప్రయాణం రుజువు చేసింది.