Bigg Boss 9 Telugu Finale Live: గ్రాండ్‌గా బిగ్ బాస్ 9 ఫినాలే.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది
బిగ్ బాస్ సీజన్ 9.. చివరి అంకానికి చేరుకుంది. ఫినాలే మొదలైంది. అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. మరికొన్ని గంటల్లోనే ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. కళ్యాణ్ పడాల, తనూజ మధ్య ఎవరు విజేత కాబోతున్నారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

LIVE NEWS & UPDATES
-
బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హీరో శ్రీకంత్
బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హీరో శ్రీకంత్ .. కాగా శ్రీకాంత్ హౌస్ లోకి వెళ్లి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది
-
డాన్స్ వేసి అదరగొట్టిన రోషన్ , అనస్వర రాజన్
ఛాంపియన్ సినిమా సాంగ్‌కు స్టేజ్ పై డాన్స్ వేసి అదరగొట్టిన రోషన్ , హీరోయిన్ అనస్వర రాజన్
-
-
స్టేజ్ పైకి వచ్చిన రోషన్, అనస్వర రాజన్
స్టేజ్ పైకి వచ్చిన రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన రోషన్, అనస్వర రాజన్. అలాగే ఛాంపియన్ సినిమా ట్రైలర్ ప్లే చేసి చూపించారు
-
విన్నింగ్ స్పీచ్ ఇచ్చి టాప్ 5 నవ్వులు పూయించారు
హౌస్ లో ఉన్నవారు విన్నర్ అయ్యి స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించారు టాప్ 5.
డీమన్ పవన్ స్పీచ్ ఎలా ఇస్తాడో ఇమ్మాన్యుయేల్ చేసి చూపించాడు.
అలాగే సంజన.. తనూజ స్పీచ్, డీమన్ పవన్.. కళ్యాణ్ స్పీచ్, తనూజ.. ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్.. సంజన స్పీచ్ ఇచ్చారు.
-
బిగ్ బాస్ స్టేజ్‌పై తన డాన్స్‌తో అదరగొట్టిన మంగ్లీ
బిగ్ బాస్ స్టేజ్‌పై తన డాన్స్‌తో అదరగొట్టిన సింగర్ మంగ్లీ, బాయిలో బల్లి పలికే సాంగ్ కు స్టెప్పులేసి మంగ్లీ
-
-
అతనే విన్నర్ అంటున్న ఎక్స్ కంటెస్టెంట్స్
విన్నర్ ఎవరు అవుతారు అని ఎక్స్ హౌస్ మేట్స్ ను అడిగి తెలుసుకున్నారు. దాంతో చాలా మంది కళ్యాణ్ పేరు, తనూజ పేరు చెప్పారు.
-
బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అదిరిందిగా..
బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ అదిరిందిగా.. స్టేజ్ పైకి ట్రోఫీని తీసుకువచ్చారు. సీజన్ 9 విన్నర్ ట్రోఫీతో పాటు, కారు, రూ. 50 లక్షలు అందజేయనున్నారు.
-
-
బిగ్ బాస్ సీజన్ 9 టోటల్ ఏవీ..
బిగ్ బాస్ 9 మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు, మొత్తం కలిసి ఓ వీడియో రూపంలో చూపించారు. హౌస్ మేట్స్ చేసిన అల్లరి, వాళ్ళ మధ్య అనుబంధం , టాస్క్ ల్లో రాణించడం, పోటీపడ్డ విధానాన్ని వీడియోలో చూపించారు.
-
టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారు
టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇమ్మాన్యుయేల్, సంజన, తనూజ, కళ్యాణ్, డీమన్ పవన్ కుటుంబ సభ్యులంతా వచ్చారు.
-
ఎక్స్ హౌస్ మేట్స్‌ను పలకరించిన నాగ్
పాత కంటెస్టెంట్స్ అందరిని పేరు పేరునా పలకరించారు నాగార్జున. అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు నాగార్జున
-
బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ లో పాల్గొన్న అందరూ స్టేజ్ పైకి వచ్చారు..
-
గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ 9 ఫినాలే
సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సంచారి సాంగ్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున
-
విన్నర్ ఎవరు అనేదాని పై ఆసక్తి
బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు వచ్చేస్తుంది.. విన్నర్ ఎవరు అనేదాని పై ఆసక్తి నెలకొంది
బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు వచ్చేసింది. ఈ గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. ఇక ఈ సీజన్ లో కామర్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 7 సెప్టెంబర్ 2025 లో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. ఇమాన్యుయెల్, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, సంజనా గల్రానీ, తనూజ పుట్టస్వామి, భరణి, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, దివ్య నిఖిత, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని , హరిత హరీష్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, శ్రష్ఠి వర్మ హౌస్ లో సందడి చేశారు.
ఇక హౌస్ లో టాప్ 5 గా ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్ , డీమన్ పవన్ నిలిచారు. కాగా వీరిలో విన్నర్ ఎవరు అవుతారని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని ప్రేక్షకులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ ఫినాలేలో చాలా ఆసక్తికర విషయాలు జరగనున్నాయి అవేంటో చూద్దాం..
Published On - Dec 21,2025 6:32 PM




