Chiranjeevi: ఈ 70 ఏళ్ళ కుర్రాడెవరు.. మరీ ఇలా ఉన్నాడేంటి.. వైరల్ అవుతున్న ఫోటోస్
చిరంజీవి రోజురోజుకీ యంగ్ అవుతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన ఫిట్‌నెస్, నయా లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. దీని వెనుక కఠినమైన డైట్, క్రమం తప్పని వ్యాయామం ఉన్నాయి. రాబోయే విశ్వంభర సినిమా కోసం తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. మెగాస్టార్ వయసును కేవలం ఒక నెంబర్‌గా మార్చేశారు.
టైమ్ అందరికీ ముందుకు వెళ్తుంటే.. చిరంజీవికి మాత్రం వెనక్కి వెళ్తున్నట్లుంది. ఈ మధ్య కాలంలో ఆయన తీరు, స్టైల్ చూసాక వయసు పెరగడం కాదు ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తుందేమో అనుకోవాలేమో..? ఏంటి నమ్మరా..? ఒకసారి ఈ లుక్స్ చూడండి.. చూసాక మళ్లీ మాట్లాడుకుందాం మెగా లుక్స్ వెనక మ్యాజిక్ గురించి..! చూస్తున్నారుగా చిరంజీవి కొత్త లుక్స్..! ఇవి చూసాక.. ఈయన మరీ రోజురోజుకీ కుర్రాడైపోతున్నాడబ్బా అనుకుంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ ఒక్కడికే కాదు.. ఇప్పుడున్న యంగ్ బ్యాచ్ అందరికీ తన లుక్స్‌తో షాకిస్తున్నారు మెగాస్టార్. మన శంకరవరప్రసాద్ గారు అయిపోవడంతో.. ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేసారు చిరు. ఎప్పటికప్పుడు నయా లుక్‌తో ట్రెండ్ అవుతున్నారీయన. మన శంకరవరప్రసాద్ గారు కోసం తన వయసు సగానికి పైగా తగ్గించుకున్నారు చిరు. దీనికోసం ఆయన చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారు. 70 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా, అందంగా కనిపించడం అంటే మాటలు కాదు.. దానికోసం ఆయన క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులతో పాటు ఏడాదిగా సపరేట్ డైట్ మెయింటేన్ చేస్తున్నారు. సినిమాలు ఉన్నా లేకపోయినా జిమ్ మాత్రం అస్సలు ఆపట్లేదు మెగాస్టార్. తన ప్రైమ్ టైమ్ కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు చిరంజీవి. ఆ కష్టమే లుక్స్‌లో కనబడతుంది. తాజాగా విడుదలైన ఫోటోషూట్‌లో మెగాస్టార్ లుక్స్ మామూలుగా లేవు. ఖాళీ టైమ్ కాస్త దొరికినా ఫిజిక్‌ఫై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు చిరంజీవి. ట్రెండ్‌కు తగ్గట్లు చిరంజీవి చేస్తున్న ఫోటోషూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బరువు కూడా భారీగానే తగ్గిపోయారు చిరు. శంకరవరప్రసాద్ వచ్చిన నాలుగు నెలలకే విశ్వంభర విడుదల కానుంది. ఫిబ్రవరి నుంచి బాబీ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు చిరు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి మెగా లుక్స్‌తో పూనకాలు పుట్టిస్తున్నారు చిరంజీవి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

