మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన షూటింగ్ పోటీల సందర్భంగా 23 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడి జరిగింది. బాధితురాలి స్నేహితురాలు, మరో ఇద్దరు ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన సమాజంలో భద్రత పట్ల ఆందోళనలను పెంచుతోంది.
షూటింగ్ పోటీలకు హాజరైన 23 ఏళ్ల మహిళా షూటర్‌పై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితురాలిని, మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ షూటింగ్ పోటీలో పాల్గొనేందుకు డిసెంబరు 16ప తన స్నేహితురాలితో కలిసి ఫరీదాబాద్ వచ్చింది. బుధవారం సాయంత్రం పోటీ ముగిసిన తర్వాత తనను మెట్రో స్టేషన్‌లో దింపమని బాధితురాలి స్నేహితురాలు ఫరీదాబాద్‌లోనే నివసించే గౌరవ్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. గౌరవ్ తన స్నేహితుడు సత్యేంద్రతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత నలుగురూ ఫరీదాబాద్‌లోనే రాత్రికి బస చేసి, మరుసటి రోజు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓ హోటల్‌లో రెండు గదులు బుక్ చేసుకుని, ఒకే గదిలో పార్టీ చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో, బాధితురాలి స్నేహితురాలు, గౌరవ్ కొన్ని వస్తువులు తీసుకురావడానికి బయటకు వెళ్లారు. అదే సమయంలో గదిలో ఉన్న సత్యేంద్ర తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వారు తిరిగి వచ్చిన వెంటనే, బాధితురాలు ఈ విషయాన్ని మరో పరిచయస్తుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అనంతరం నిందితుడిని గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సరాయ్ ఖవాజా పోలీసులు.. సత్యేంద్ర, గౌరవ్, బాధితురాలి స్నేహితురాలిని అరెస్ట్ చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రానివ్వని గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు..

