Ravi Teja: కలిసొచ్చిన జోనర్‌లోకి వచ్చిన రవితేజ.. ఇప్పటికైనా హిట్ పక్కనా
రవితేజ చాలా కాలం తర్వాత తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కామెడీ జోనర్‌లోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో తిరిగి వస్తున్నారు. మాస్ సినిమాలపై దృష్టి సారించి ఈ జోనర్‌ను మిస్ చేసుకున్న రవితేజ, సంక్రాంతికి ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్‌కు మరో మైలురాయి అవుతుందని అంచనా.
కొన్ని జోనర్స్ కొందరు హీరోలకు బాగా కలిసొస్తుంటాయి.. కానీ బిజీగా ఉండి వాళ్లే పెద్దగా పట్టించుకోరు. అలా రవితేజ కొన్నేళ్లుగా ఓ జోనర్‌ను బాగా మిస్ చేసారు.. ఇంకా చెప్పాలంటే మాస్ మాయలో పడి పట్టించుకోలేదు కూడా. ఇన్నాళ్లకు తనకు బాగా కలిసొచ్చిన ఆ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చారీయన. ఈసారి అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి కూడా. మరి ఈ కథేంటో చూద్దామా..? చూస్తున్నారుగా.. ఇద్దరు భామల మధ్య రవితేజ ఎలా నలిగిపోతున్నారో..? ఇలాంటి కాన్సెప్టులు పండక్కి భలే వర్కవుట్ అవుతుంటాయి. అందుకే రవితేజ ప్లాన్ చేసి మరీ కిషోర్ తిరుమలతో భర్త మహాశయులకు విజ్ఞప్తి రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసారు. సంక్రాంతికి పర్ఫెక్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బరిలోకి దిగుతున్నారు మాస్ రాజా. రవితేజ తీరు చూస్తుంటే ఈసారి ఫ్యామిలీస్‌ను గట్టిగానే టార్గెట్ చేసారని అర్థమవుతుంది. ఓ వైపు ఆషికా, డింపుల్ గ్లామర్ ట్రీట్.. కిషోర్ తిరుమల రైటింగ్.. రవితేజ ఎనర్జీ భర్త మహాశయులకి విజ్ఞప్తికి బానే కలిసొస్తున్నాయి. పైగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, అమ్మా నాన్న ఓ తమళ అమ్మాయి నుంచి ఫ్యామిలీ విత్ కామెడీ జోనర్ రవితేజకు ఎప్పుడూ కలిసొచ్చిన జోనరే. రవితేజ అప్పట్లో చేసిన వెంకీ, నా ఆటోగ్రాఫ్, కిక్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా ఎక్కేసాయి. అలాగే గత పదేళ్లలో రాజా ది గ్రేట్ సైతం కుటుంబ ప్రేక్షకులను బాగానే అలరించింది. మధ్యలో మాస్ మాస్ అంటూ ఈ జోనర్ వైపు చూడలేదు రవితేజ. ఇన్నాళ్లకు భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

