AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chirutha Movie: చిరుత సినిమా చేయాల్సిన ఆ హీరో.. ఇప్పుడు వరుస ప్లాప్స్‏తో.. రామ్ చరణ్ కంటే ముందే..

సాధారణంగా సినీరంగంలో ఒక హీరోను ఊహించుకుని దర్శకులు కథలు రాసుకుంటారు. కానీ ఊహించని విధంగా ఆ స్టోరీని మరో హీరో దగ్గరకు వెళ్లి ఆగుతుంది. కొన్ని సందర్భంగా కొందరు స్టార్స్ ఖాతాలో పడాల్సిన హిట్స్ మరికొందరు ఖాతాలో పడుతుంది. అలాగే పలువురు హీరోలు కొద్ది భారీ డిజాస్టర్లను మిస్ అవుతుంటారు. రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా విషయంలోనూ అదే జరిగింది.

Chirutha Movie: చిరుత సినిమా చేయాల్సిన ఆ హీరో.. ఇప్పుడు వరుస ప్లాప్స్‏తో.. రామ్ చరణ్ కంటే ముందే..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2025 | 7:48 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వెండితెరకు పరిచయమైన మొదటి సినిమా చిరుత. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇక ఇందులోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. నేహా శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు ముందుగా రామ్ చరణ్ ఛాయిస్ కాదని.. అంతకంటే ముందే టాలీవుడ్ యంగ్ హీరో కోసం ఈ స్టోరీని రెడీ చేసుకున్నారని ప్రముఖ సీనియర్ రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తోట ప్రసాద్ మాట్లాడుతూ.. చిరుత కథ మొదట పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా అనుకున్నారని.. ఆ కథను ముందుగా మెహర్ రమేష్ రాసుకున్నాడని… బ్యాంకాక్ వెళ్లి అక్కడ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేశారని.. కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత అదే కథ చిరంజీవి దగ్గరికి వెళ్లిందని.. నిర్మాత అశ్వినీదత్ కు మెహర్ రమేష్ దగ్గర ఆ కథ ఉందని తెలిసి.. దాని గురించి పూరి జగన్నాథ్ కు కూడా ఐడియా ఉండడంతో రామ్ చరణ్ కు కరెక్ట్ గా సరిపోతుందని భావించి చిరు వద్దకు తీసుకెళ్లారట. చిరంజీవి తన తనయుడిని దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేసి.. హీరోను మరింత మాస్ గా చూపించడంతో చిరు ఒకే చేశారని.. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని కోరడంతో పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారట.

Sai Ram Shankar

Sai Ram Shankar

సాయి రామ్ శంకర్ తో ఈ సినిమాను తీసేటప్పుడు ఈ మూవీ స్టోరీ టైటిల్ చిరుత కాదని.. సినిమా ఆగిపోయాకే ఆ కథ మార్చి చిరుత టైటిల్ పెట్టారని అన్నారు. ఆ సినిమా సాయి రామ్ శంకర్ కు పడి ఉంటే కచ్చితంగా ఆయన కెరీర్ టర్న్ అయ్యి ఉండేదని అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో చరణ్ నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. రంగస్థలం సినిమాతో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చరణ్… ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టా్ర్ గా మారారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?