AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: అఫీషియల్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ ఎప్పుడంటే? ఈసారి మరిన్ని హంగులతో..

బుల్లితెర అభిమానులను అలరించేందుకు బిగ్ బాస్ ఫెస్టివల్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక తెలుగులో ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. తాజాగా ఈ క్రేజీ షోకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Bigg Boss Telugu 10: అఫీషియల్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ ఎప్పుడంటే? ఈసారి మరిన్ని హంగులతో..
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jul 20, 2026 | 8:05 PM

Share

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఈసారి ఆడియెన్స్ కోసం సరికొత్తగా ముస్తాబుకానుంది. రాబోయే బిగ్ బాస్ సీజన్‌ను మరింత రంగులమయం చేయడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోస్టార్ ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. అదేంటంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లో ఒకేసారి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంటే ఇకపై భాషల వారీగా బిగ్ బాస్‌ను చూడటానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, బంగ్లా వెర్షన్లు సెప్టెంబర్ నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్ అలాగే ‘జియోహాట్‌స్టార్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఈసారి సౌరవ్ గంగూలీ కూడా..

ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తయ్యాయి. కాబట్టి ల్యాండ్ మార్క్ సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని జియో హాట్ స్టార్ ప్రకటించింది. ఇక కన్నడ వెర్షన్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్‌లాల్ యధావిధిగా హోస్ట్‌లుగా కొనసాగుతారు. ఈసారి విశేషం ఏమిటంటే, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాలీ బిగ్ బాస్ ఎడిషన్ కు కొత్త హోస్ట్‌గా చేయనున్నారు.

ఈ మెగా లాంచ్ సందర్భంగా, జియోస్టార్ ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే పేరుతో ఒక ప్రత్యేక టేబుల్ పుస్తకాన్ని విడుదల చేసింది. బిగ్ బాస్ 20 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను విడుదల చేశారు. అదేంటంటే.. 2025 నాటికి ఆరు భాషల్లో బిగ్ బాస్ రికార్డు స్థాయిలో 500 మిలియన్ల ప్రేక్షకులను సంపాదించుకుంది. ఒక్క దక్షిణ భారత రాష్ట్రాల్లోనే 3 కోట్లకు పైగా ప్రజలు బిగ్ బాస్‌ను చూస్తారట. ఇక్కడ ప్రతి 10 మంది టీవీ వీక్షకులలో 8 మంది బిగ్ బాస్‌ను చూస్తారట. ఇది దక్షిణ భారతదేశంలోని ఇతర అన్ని రియాలిటీ షోల సంయుక్త వీక్షకుల సంఖ్య కంటే 3.5 రెట్లు ఎక్కువ. జియోహాట్‌స్టార్‌లో ప్రతి 10 మంది వీక్షకులలో 6 మంది 24 గంటల లైవ్ ఫీడ్‌ను చూస్తున్నారు. 2025 సీజన్‌లో 1.7 బిలియన్ల సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌లు, 30 మిలియన్లకు పైగా యూజర్-జనరేటెడ్ మీమ్స్ ఉన్నాయని చూపే డేటాను జియోస్టార్ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ కు ప్రజాదరణ పెరిగే కొద్దీ, ఈ షోకు స్పాన్సర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. 2025 నాటికి, 46 విభాగాలకు చెందిన 625కు పైగా బ్రాండ్లు ఈ షోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వీటిలో 49 కొత్త బ్రాండ్లు ఉన్నాయని జియో హాట్ స్టార్ వెల్లడించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us