Hari Hara Veera Mallu:అమాంతం పెరిగిన హరి హర వీరమల్లు కలెక్షన్లు.. 3 రోజులకు కలిపి మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?
అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 24న ప్రపంచ వ్యాప్తంగా హరి హర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీఎఫ్ఎక్స్ విషయంలో తప్పితే అన్ని అంశాల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో వీరమల్లుకు క్రమంగా కలెక్షన్లు పెరుగుతున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 24న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పోరాట యోధుడిగా పవన్ కల్యాణ్ ను చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. అయితే సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ పై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. కొన్ని సీన్లలో మరీ నాసిరకంగా వీఎఫ్‌ఎక్స్ ఉందని విమర్శలు వచ్చాయి. అయినా మొదటి రోజు వీరమల్లు సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. మొత్తం 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ప్రీమియర్ షోస్ ద్వారా రూ.12.7 కోట్లు నెట్ కలెక్షన్స్ రాగా.. రూ.47.5 కోట్ల వసూల్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు తెలిపారు. అయితే రెండో రోజు శుక్రవారం ఈ సినిమా వసూళ్లు కాస్త తగ్గాయి. శుక్రవారం ఇండియాలో రూ.8 కోట్ల నెట్ వసూల్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం రెండు రోజుల కలెక్షన్స్ కలిపి రూ.55.5 కోట్లుగా వసూలు చేసింది. అయితే వీకెండ్ రావడంతో శనివారం (జులై 26) వీరమల్లు కలెక్షన్లు అమాంతం పెరిగాయి. ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం హరి హర వీరమల్లు సినిమాకు శనివారం ఇండియాలో రూ.9.86 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక మూడు రోజుల్లో ఇండియాలో హరి హర వీరమల్లు సినిమా రూ. 65.88 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది. అదే ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ. 91 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే మాత్రం పవన్ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో అడుగు పెడుతుంది.
ఇక హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగేజు పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే సుబ్బరాజు, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. కీరవాణి అందించిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
POWERSTAR @PawanKalyan and @MMKeeravaani set the screens on FIRE 🤩🔥
A massive cinematic experience awaits you in theatres near you ❤️#HariHaraVeeraMallu #BlockbusterHHVM Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani… pic.twitter.com/FiXazj3axo
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








