Tollywood: అన్నా.. నువ్వు మహేష్ సినిమాలో నటించావా? ‘బాబీ’లో కనిపించిన ఈ టాలీవుడ్ డైరెక్టర్‌ను గుర్తు పట్టారా?
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన ఫొటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లుగా వెలుగొందుతోన్న చాలా మంది గతంలో సిల్వర్ స్క్రీన్ పై చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రేమ కథా చిత్రాల్లో బాబీ ఒకటి. వర్షం ఫేమ్ దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ సరసన దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించింది. అలాగే ప్రకాశ్ రాజు, రఘువరన్, బ్రహ్మానందం, సునీల్, ప్రగతి, రమా ప్రభ, రవి బాబు, పోసాని కృష్ణమురళి, లక్ష్మీపతి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. 2002లో రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం పెద్దగా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. అయితే మహేశ్- ఆర్తి ఆగర్వాల్ జోడీకి మంచి పేరొచ్చింది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇదే బాబీ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ సునీల్ పాత్రలో ఒక టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నటించాడు. పై ఫొటో అదే. మరి అతనెవరో గుర్తు పట్టారా? మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి దగ్గరి బంధువైన అతను తెలుగుతో పాటు కన్నడ భాషల్లో సినిమాలు చేశాడు. పునీత్ రాజ్ కుమార్, ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇందులో కొన్ని సూపర్ హిట్స్ అయినా మరికొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ముఖ్యంగా ఈ డైరెక్టర్ చివరిగా మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీశాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేయలేదీ డైరెక్టర్. ఈ పాటికే చాలా మందికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. యస్.. అతను మరెవరో కాదు మెహర్ రమేష్.
డైరెక్టర్ కాక ముందు నటుడిగా ప్రయత్నించాడు మెహర్ రమేష్. మహేష్ బాబు హీరోగా నటించిన బాబి సినిమాలో బాబీ స్నేహితుడు సునీల్ పాత్రలో మెహర్ రమేష్ నటించాడు. ఆయన దర్శకుడు కాకముందే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడు. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ నటించిన వీర కన్నడిగ (ఆంధ్రావాలా కన్నడ రీమేక్) సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత పునీత్ తోనే అజయ్ (ఒక్కడు కన్నడ రీమేక్) సినిమాను తీసి మరో హిట్ కొట్టాడు.
మహేష్ బాబుతో మెహర్ రమేష్..
View this post on Instagram
ఇక ఎన్టీఆర్ కంత్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు మెహర్ రమేష్. బిల్లాలో ప్రభాస్ ను స్టైలిష్ గా చూపించాడు. అయితే ఆ తర్వాత చేసిన శక్తి, షాడో సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. వీటి తర్వాత పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మెగాస్టార్ తో చేసిన భోలా శంకర్ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నాడు మెహర్ రమేష్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








