Tollywood Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు టెన్షన్… సడెన్‌గా సీన్‌లోకి ఈడీ ఎంట్రీ.. మనీ లాండరింగ్‌, హవాల వ్యవహారాలు..?

టాలీవుడ్‌లో మరోసారి కలకలం చెలరేగింది.  డ్రగ్స్‌ పెడ్లింగ్‌, అమ్మకం, తరలింపు ఇవి నేరాలు. డ్రగ్స్ వాడితే బానిసలు, వాళ్లు బాధితులు. ఇదే రీజన్‌తో గతంలో టాలీవుడ్‌లో డ్రగ్స్‌ చైన్‌పై...

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు టెన్షన్... సడెన్‌గా సీన్‌లోకి ఈడీ ఎంట్రీ.. మనీ లాండరింగ్‌, హవాల వ్యవహారాలు..?
Tollywood Drugs Case
Follow us

|

Updated on: Aug 26, 2021 | 10:42 AM

టాలీవుడ్‌లో మరోసారి కలకలం చెలరేగింది.  డ్రగ్స్‌ పెడ్లింగ్‌, అమ్మకం, తరలింపు ఇవి నేరాలు. డ్రగ్స్ వాడితే బానిసలు, వాళ్లు బాధితులు. ఇదే రీజన్‌తో గతంలో టాలీవుడ్‌లో డ్రగ్స్‌ చైన్‌పై కేసు అలా ఆగిపోయింది. వాళ్లు నేరస్తులు కాదు.. బాధితులు అని పిక్సయ్యాం. కొందరిపై వచ్చిన ఆరోపణలు అసలు ఆధారాలేవంది అప్పుడు దర్యాప్తు చేసిన సిట్‌. కానీ.. ఇదే కేసులో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అంటే డ్రగ్స్‌ను మించిన మరో నేరం ఇక్కడేదో ఉంది. డ్రగ్స్‌ను మంచి డబ్బు రూపంలో ఆ నేరం జరిగిందా. మనీ లాండరింగ్‌, హవాల వ్యవహారాలు టాలీవుడ్‌ సెంట్రిక్‌గా టాలీవుడ్‌లో మరోసారి కలకలం చెలరేగింది.  నోటీసులు అందిన మాట వాస్తవం. విచారణకు హాజరు కావాలన్నది సుస్పష్టం. ఆ 12 మంది విచారణకు హాజరుకావాలన్నది నోటీసుల సారాంశం. నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి ఎందుకు వచ్చింది? ఆ 12 మందికి నోటీసులు సర్వ్ చేయడంలో ఉద్దేశమేంటి? వారి నుంచి ఈడీ ఎలాంటి సమాచారం రాబట్టబోతుంది? డ్రగ్స్ నిషా కక్కించబోతుందా? ఈడీ నోటీసులిప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.

అది 2017.. టాలీవుడ్‌లో ప్రకంపనలు. ఎక్సైజ్‌ శాఖ శాఖ సిట్‌ ముందు వరుసబెట్టి పెట్టి హాజరైన సినీ ప్రముఖులు. పూరీ జగన్నాథ్ మొదలు.. ముమైత్‌ ఖాన్ వరకు. టాలీవుడ్‌లో అనేక మంది డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ నేతృత్వంలోని సిట్ విచారణ చేపట్టింది. 11 రోజులపాటు సాగిన విచారణలో 62 మందిని రకరకాలుగా ప్రశ్నించారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి 12 కేసుల్లో 4 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఏదో జరగబోతుంది? విచారణ.. అరెస్ట్‌ల వరకు వెళ్తోంది? ఎప్పుడు ఎవరికి పిలుపువస్తుందో తెలియదు? ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో తెలియక టాలీవుడ్‌ మొత్తం షేక్ అయ్యింది. ఇక అరెస్ట్‌లే తరువాయి అన్నట్లు సాగింది హడావుడి. అవన్నీ ఆరోపణలే తప్ప ఆధారాలు లేవన్నది సిట్ విచారణ సారాంశం. దీంతో డ్రగ్స్‌ కేసు అలా ఫైళ్లకు పరిమితమైంది.

తాజాగా.. శాండల్‌వుడ్‌లో.. FSL నిర్థారణ.. మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. హీరోయిన్స్‌ సంజన, రాగిణిలు డ్రగ్స్‌ వాడినట్లుగా తేలడంతో.. కన్నడ సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. అయితే..శాండిల్‌ వుడ్‌లో డ్రగ్స్‌ లింక్స్‌.. ఇతర వుడ్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీని.. డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. సుశాంత్‌ కేసులో.. బాలీవుడ్‌ మత్తు సంబంధాలు ప్రకంపనలు సృష్టించాయి.

2021 ఆగస్ట్ 21.. మళ్లీ ఒక్కసారిగా కలకలం.. 12 మంది ఫిల్మ్ స్టార్స్‌కు ఈడీ నోటీసులు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న రవితేజ, రానా, తరుణ్‌, పూరి జగన్నాథ్, నవదీప్, చార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్‌, నందు, శ్రీనివాస్‌కు మళ్లీ ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు అందర్ని 23 రోజుల పాటు విచారించేందుకు సిద్ధమైంది. అప్పుడు సిట్‌ విచారణ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్‌ చేస్తే.. ఇప్పుడు ఏకంగా ఈడీ ఎంట్రీ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంట్రీ దేనికి సంకేతం? అసలు డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీ అంటే.. ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్‌తో పాటే.. మనీ లాండరింగ్ జరిగిందన్నది ఈడీకి ఉన్న సమాచారం. ఈ రూట్‌ మ్యాప్‌కు సంబంధించిన కూపీ లాగబోతున్నారు అధికారులు, నగదు, విదేశీ మాదకద్రవ్యాలపై స్పెషల్ నజర్ పెట్టే ఈడీ కన్ను టాలీవుడ్‌పై పడడం.. ఉత్కంఠ రేపుతోంది.

Also Read: పెద్ద కొడుకు అప్పు చేసి భార్యతో పారిపోయాడు.. అవమానం, బాధ తట్టుకోలేక మిగిలిన కుటుంబమంతా

 ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.. బద్వేలులో ప్లాంట్‌.. 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు