AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.. బద్వేలులో ప్లాంట్‌.. 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ...

Andhra Pradesh: ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.. బద్వేలులో ప్లాంట్‌.. 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
Century Plyboards Investmen
Ram Naramaneni
|

Updated on: Aug 26, 2021 | 10:58 AM

Share

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలను సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించి చర్చించారు. రైతులతో యూకలిప్టస్‌ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్లపై గిట్టుబాటు ధర కల్పన, ఆర్థికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా కంపెనీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటికే యూనిట్‌లు ఏర్పాటుచేసింది.

ఏపీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం, 3 వేల మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ప్లాంట్‌ 2024 డిసెంబర్‌ వరకు మూడు దశల్లో పూర్తి కానుంది. ఏడాదికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి మూడు దశలు పూర్తయ్యే సరికి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల పూర్తి స్థాయి సామర్ధ్యంతో ప్లాంట్‌ సిద్ధం కానుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవన్‌ ఉన్నారు.

Also Read: ఉపశమనం..! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

AP Schools: స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ.. అయోమయ స్థితిలో పేరెంట్స్

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం