Petrol Diesel Price: వాహనదారులకు త్వరలోనే గుడ్‌న్యూస్.. ఇవాళ మాత్రం మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా..
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ...
Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో తేడా ఉంది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.94గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.42గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.79గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.65గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.09గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.81 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.75 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.34 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.27 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.88లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.43గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.40గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.81 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.75లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.30ఉండగా.. డీజిల్ ధర రూ.93.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.32 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.34 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.57 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.30గా ఉంది.
ఇవి కూడా చదవండి: Viral Video: హడావిడిగా రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నించాడు.. అప్పుడేం జరిగిందో చూస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు..