ATM Fine: ఏటీఎంల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు.. అదేంటంటే..

ATM Fine: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనేక మార్పులను తీసుకువస్తోంది. రోజురోజుకు కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. బ్యాంకు వినియోగదారులకు..

ATM Fine: ఏటీఎంల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు.. అదేంటంటే..
Atm
Follow us
Subhash Goud

|

Updated on: Aug 26, 2021 | 8:13 AM

ATM Fine: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనేక మార్పులను తీసుకువస్తోంది. రోజురోజుకు కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. బ్యాంకు వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు చేపడుతోంది. ఇక బ్యాంకు కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఊరట కలిగించే ప్రతిపాదన తీసుకువచ్చింది. బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు జరిమానాల విధింపు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో బ్యాంకు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది.

ఏటీఎంలలో డబ్బులు లేకపోతే..

ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు, వైట్‌ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు భారీ మొత్తంలో చార్జీలు పడనున్నాయి. నెలలో 10 గంటలకు మించి ఏటీఎంలో క్యాష్ లేకపోతే అప్పుడు చార్జీల విధింపు ఉంటుంది. ఆర్బీఐ విధించే ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బ్యాంకు వినియోగదారులకుకు ఊరట కలుగనుంది.

ఏటీఎంలలో ఎప్పుడూ క్యాష్‌ ఉండేలా..

చాలా ఏటీఎంలలో క్యాష్ ఉండటం లేదు. దీంతో కస్టమర్లు ఏటీఎం సెంటర్లకు వచ్చి డెబిట్‌ కార్డు పెట్టి పిన్‌ ఎంటర్‌ చేసిన తర్వాత క్యాష్‌ లేదని చూపిస్తుంది. దీంతో సమయం వృధా కావడమే కాకుండా వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో ఎప్పుడూ క్యాష్ అందుబాటులో ఉండేలా ఈ కొత్త నిబంధనలు తీసుకువస్తోంది.

ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల జరిమానా..

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. ఏటీఎంలలో క్యాష్‌ లేకపోతే బ్యాంకులకు, వైట్‌ లేబుల్‌ ఆపరేటర్లకు జరిమానా పడనుంది. ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా పడుతుంది. ఆర్‌బీఐ జరిమానా విధింపు నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు వాటి వాటి ఏటీఎంలలో ఎప్పుడు క్యాష్ అందుబాటులో ఉండేలా చూసుకోనున్నాయి.

కాగా, ఇలా ఎన్నో ఏటీఎంలలో సరైన డబ్బులు ఉండటం లేదు. అత్యవసరంగా వారు ఏటీఎంలకు వచ్చి కార్డు పెట్టే వరకు కూడా తెలియడం లేదు ఏటీఎంలో క్యాష్‌ లేదని. కొన్ని ఏటీఎంలలో క్యాష్‌ లేదని ముందుగానే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా డబ్బుల కోసం దూరంగా ఉన్న ఏటీఎంల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఏటీఎంలలో క్యాష్‌ ఉండటం లేదనే దానిపై కూడా వినియోగదారుల నుంచి ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ కూడా చదవండి:

LIC Arogya Rakshak: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. ఒక్కపాలసీతో ఇంట్లో వారందరికి బెనిఫిట్స్‌..!

LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!