- Telugu News Photo Gallery Business photos know all the details of Life Insurance Corporation jeevan umang policy benefits and more
LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!
LIC Policy: వినియోగదారుల కోసం రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ పలు బీమా కంపెనీలు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే విధంగా పాలసీలను అందుబాటులోకి ..
Updated on: Aug 24, 2021 | 5:33 PM

LIC Policy: వినియోగదారుల కోసం రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ పలు బీమా కంపెనీలు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే విధంగా పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది.

ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిల్లో మీ అవసరాలకు అనుగుణమైన పాలసీ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎల్‌ఐసీ పాలసీల్లో జీవన్ ఉమాంగ్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి.

55 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది ఎండోమెంట్ పాలసీ. ఇందులో చేరితే లైఫ్ కవర్‌తో పాటు డబ్బులు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇందులో రెండు ప్రయోజనాలు లభిస్తాయి.

జీవన్ ఉమాంగ్ పాలసీ వల్ల కలిగే మరో బెనిఫిట్ 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 లక్షలకు బీమా మొత్తానికి 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌తో పాలసీ తీసుకుంటే నెలకు దాదాపు రూ.1280 ప్రీమియం పడుతుంది. మీరు 15, 20, 25, 30 సంవత్సరాల టర్మ్‌తో పాలసీ తీసుకోవచ్చు.

మీరు 30 ఏళ్లు ప్రీమియం చెల్లించి తర్వాత అంటే.. మీకు 60 ఏళ్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.40 వేల వరకు పొందే అవకాశం ఉంటుంది. వందేళ్ల వరకు మీకు ఇలానే ప్రతి ఏడాది డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు 100 తర్వాత కూడా జీవించి ఉంటే.. మీకు బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం వంటివి లభిస్తాయి. ఇలా పాలసీ తీసుకునే ముందుకు అన్ని వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.




