- Telugu News Photo Gallery Business photos Can we revive lic policy online how can i revive my lic policy can lic policy be revived after 5 years what is the revival of a policy
LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్.. రద్దయిన పాలసీలను పునరుద్దరించేందుకు ఆలస్య రుసుములో మినహాయింపు!
LIC Policy: దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ (LIC) వినియోగదారులకు ఎన్నో సేవలను అందిస్తోంది. రద్దు చేయబడిన పాలసీలను పునరుద్దరించుకు..
Updated on: Aug 23, 2021 | 6:35 PM

LIC Policy: దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ (LIC) వినియోగదారులకు ఎన్నో సేవలను అందిస్తోంది. రద్దు చేయబడిన పాలసీలను పునరుద్దరించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సదుపాయం అక్టోబర్ 22 వరకు ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆలస్య రుసమును మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్, అధిక రిస్క్ ప్లాన్స్ ఉండవు. వైద్య అవసరాలకు మినహాయింపు లేదు. అర్హత కలిగిన ఆరోగ్య, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై కూడా ఆలస్య రుసుము మినహాయింపు లభిస్తుంది.

రద్దయిన పాలసీలలో మొదట చెల్లించిన ప్రీమియం నుంచి 5 సంవత్సరాలలో నిర్ధిష్ట పాలసీలను ప్రారంభించవచ్చు అని తెలిపింది. ఇందులో కొన్ని నిబంధనలు, షరతులు విధించింది. టర్మ్ అస్యూరెన్స్, మల్టిఫుల్ రిస్క్ పాలసీలు వంటి ప్లాన్స్‌కు మినహాయింపు ఉండదు.

మొత్తం ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం రాయితీ ఉంటుంది. గరిష్టంగా తగ్గింపు రూ.2 వేల వరకు ఉంటుంది. మొత్తం లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న పాలసీలకు ఆలస్య రుసుములో 25 శాతం రాయితీ ఉంటుంది.

మీరు 30 ఏళ్లు ప్రీమియం చెల్లించి తర్వాత అంటే.. మీకు 60 ఏళ్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.40 వేల వరకు పొందే అవకాశం ఉంటుంది. వందేళ్ల వరకు మీకు ఇలానే ప్రతి ఏడాది డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు 100 తర్వాత కూడా జీవించి ఉంటే.. మీకు బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం వంటివి లభిస్తాయి. ఇలా పాలసీ తీసుకునే ముందుకు అన్ని వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ఉన్న పాలసీలు, పాలసీ వ్యవధిని పూర్తి చేయని పాలసీలను ఇందులో భాగంగా పునరుద్దరించుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది.

ప్రతికూల కారణాల వల్ల తమ ప్రీమియంలు చెల్లించలేని పాలసీదారులకు ఉపశమనం అందించడమే ఎల్‌ఐసీ ప్రచార లక్ష్యం. పాలసీదారులు తమ పాలసీని పునరుద్దరించడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికి ఇది మంచి అవకాశం.




