- Telugu News Photo Gallery Business photos Amazon Grand Gaming Days sale to start from August 22: Check offers, discounts and more
Amazon Grand Gaming Days Sale: అమెజాన్ మరో బంపర్ ఆఫర్.. వీటిపై భారీ తగ్గింపు..!
Amazon Grand Gaming Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారుల కోసం మరో సేల్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బంపర్ ఆఫర్లతో సేల్‌ను..
Updated on: Aug 22, 2021 | 8:42 PM

Amazon Grand Gaming Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారుల కోసం మరో సేల్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బంపర్ ఆఫర్లతో సేల్‌ను ప్రారంభించిన అమెజాన్.. మరో సేల్‌లో ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ గేమింగ్ సేల్స్‌లో భాగంగా ల్యాప్‌టాప్స్, టీవీలు డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్, ఎల్‌జీ, హెచ్‌పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలకు ఆఫర్లు, డిస్కౌంట్లను అందించనుంది.

డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్, అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్సేఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చును.

హెచ్‌పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది. అలాగే ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్515-56 గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 69,990 అందుబాటులో ఉంది .

అలాగే ఎమ్‌ఎస్‌ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్‌హెచ్‌డీ మోడల్‌ను రూ. 74,990 అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్‌టాప్‌ను రూ . 67, 557 కు లభించనుంది. పలు టీవీలపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్‌లు అందిస్తోంది. సోనీ బ్రావీయా 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ రూ. 83,990కు, రెడ్‌మీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీను రూ. 45,999కు అందుబాటులో ఉండనుంది.




