Hair Smuggling: వెంట్రుకలే కదా అని తీసిపడేయకండీ.. ఆ కురులే వారిని కుబేరులను చేస్తున్నాయి.. ఇది ఎలానో తెలుసుకోండి..
వెంట్రులదేముందీ? అని మనమిక్కడ డెడ్ చీప్ గా కొట్టేస్తాం కానీ వాళ్లక్కడ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఏంటి తలనీలాల్లో ఇంత మనీమేటరుందా?జుట్టే కదా అని మనమిక్కడ తేలిగ్గా తీసిపారేస్తే..ఇవే కురులు వాళ్లను కుబేరులను చేస్తోందా? ఏంటీ తల నీలాల వెనక దాగిన నిజాలు అని అనుకుంటున్నారా.. అయితే చదవండి...
వెంట్రులదేముందీ? అని మనమిక్కడ డెడ్ చీప్ గా కొట్టేస్తాం కానీ వాళ్లక్కడ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఏంటి తలనీలాల్లో ఇంత మనీమేటరుందా?జుట్టే కదా అని మనమిక్కడ తేలిగ్గా తీసిపారేస్తే..ఇవే కురులు వాళ్లను కుబేరులను చేస్తోందా? ఏంటీ తల నీలాల వెనక దాగిన నిజాలు అని అనుకుంటున్నారా.. అయితే చదవండి… ఏ పుట్టలో ఏ పాముందో అంటుంటాం. కానీ ఏ జుట్టులో ఏ స్కాముందో తెలీదు. గత కొన్నాళ్లుగా వెంట్రుకల చుట్టూ నడుస్తున్న వ్యవహారాలను బట్టీ చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. మన తెలుగు ఆలయాలైన తిరుమల- సింహాచలం వంటి ప్రధానాలయాల్లో మనం మొక్కుబడుల కింద ఇచ్చేసే తలనీలాలకు చైనా వంటి దేశాల్లో భారీ డిమాండుంది. దీంతో వెంట్రుకల చుట్టూ ఒక హెయిర్ మాఫియా అల్లుకుని ఉన్నట్టు గుర్తించారు ఈడీ అధికారులు. అందుకే గుంటూరు, హైదరాబాద్ కేంద్రంగా.. సోదాలు నిర్వహించారు.
సముద్ర తీర ప్రాంతమైన నెల్లూరు- ఆ పక్కనే ఉండే చిత్తూరు జిల్లాల నుంచి వయా గుంటూరు, హైదరాబాద్.. టూ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిల్యాండ్ ఇదీ హెయిర్ కారిడార్.. కొందరు అక్రమార్కులు నకిలీ వేబిల్లులతో వెంట్రుక వాసిలో ఈ తలనీలాలను తరలించేస్తున్నారట.
వెంట్రుకల వెనుక మనీ మేటర్..
ఈ విషయం గుర్తించిన ఈడీ ఒక్కసారిగా అవాక్కయ్యింది. కారణమేంటంటే.. మనం తేలిగ్గా తీసిపారేసే వెంట్రుకల వెనక ఇంత భారీ మనీ మేటరుందా? ఒకటీ రెండు కాదు.. ఏకంగా 6 వేల కోట్ల నుంచి 8 వేల కోట్ల రూపాయల వరకూ దందా చేస్తున్నారా? అని ఆశ్చర్యపోయారు ఈడీ అధికారులు.
వెంట్రుకలపై ED ఫోకస్..
హైదరాబాద్లో 8, గుంటూరులో ఒక చోట.. మొత్తం 9 చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టీ.. ఈ వెంట్రుకల మాఫియా మీదకు మళ్లింది. మనం మొక్కుల పేరిట, జుత్తు ఎక్కువగా పెరిగిందని విసిగి వేసారి తీసి పడేస్తున్న ఈ తలనీలాల వెనక ఇన్నేసి మాయలున్నాయా? అని విస్తుపోతున్నారు ఒక్కొక్కరూ.
ఈ హెయిర్ స్మగ్లింగ్ ఏ మాత్రం అనుమానం రాకుండా సాగుతున్నట్టు గుర్తించారు. హెయిర్ కటింగ్ సెలూన్లనే కేంద్రంగా చేసుకుని చైనా- మయన్మార్- బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలకు పంపించేస్తున్నారట. వికాస్ ఎంటర్ ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్ పోర్టర్స్, హృతిక్ ఎగ్జిమ్, ఎక్స్ లెంట్ హెయిర్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పక్కా సమాచారం అందుకున్న మీదటే.. ఈడీ దాడులు చేస్తోంది.
ఈడీతో పాటు కస్టమ్స్ అధికారులు సైతం సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో కోట్ల రూపాయల విలువైన తలనీలాలను స్వాధీనం చేసుకున్నారట. హైదరాబాద్ కార్గో నుంచి చైనా, మయన్మార్ దేశాలకు తరలి వెళ్తున్న వీటి వెనక నిజాలను వెలుగులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.
కోట్లు కురిపిస్తున్న దందా..
ఇక్కడ గుర్తించాల్సిన అంశమేంటంటే.. వెంట్రుకల అక్రమ రవాణాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు అత్యంత కీలకమని గుర్తించింది ఈడీ. విదేశీ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తూ సాగిస్తున్న ఈ కోట్ల రూపాయల దందాలో మరో మతలబు కూడా ఉంది. అదేంటంటే.. రికార్డుల్లో ఒకరకంగా రాయటం.. వాటిని బయట కోట్ల రూపాయలకు చేతులు మార్చటం గుర్తించారు అధికారులు.
ఇటీవల కాలంలో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన హెయిర్ స్మగ్లింగ్ ఇష్యూ ఒకటి వెలుగు చూసింది. ఈ జుత్తును మయన్మార్ నుంచి థాయిల్యాండ్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇంతకీ ఈ వెంట్రుకలతో వాళ్లకేం పని? అంటే మొదట ప్రాసెసింగ్ చేసి.. తర్వాత వాటిని చైనాకు పంపుతారు. అక్కడ వీటిని విగ్గులుగా తయారు చేస్తారు. చైనా నుంచి ఈ విగ్గులను ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం విగ్గుల వ్యాపారంలో చైనా వాటా ఏకంగా 70 శాతం. దీన్నిబట్టీ తెలుసుకోవచ్చు.. మనం లైట్ తీసుకునే హెయిర్ కి ఇక్కడెంత వాల్యూ ఉందో..
మన వెంట్రుకలకు మాత్రమే ఎందుకంత డిమాండ్..?
ఇంతకీ మన తెలుగు రాష్ట్రాల వెంట్రుకలకు మాత్రమే ఎందుకంత డిమాండ్? ఇక్కడి నుంచే ఎక్కువగా హెయిర్ మాఫియా తన కార్యకలాపాలను సాగించడంలో అర్ధమేంటి? అంటే.. ఇక్కడే ఉంది అసలు నీలాల నిజం. బేసిగ్గా మన దగ్గర మాత్రమే తల నీలాలను మొక్కుబడిగా సమర్పించడం ఎక్కువ. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున వెంట్రుకల నిల్వ దొరుకుతుంది. ఇదే విగ్గుల వ్యాపారంలో మన జుట్టుకు భారీ డిమాండ్ ఏర్పడేలా చేసింది..
తలనీలాల నిల్వల్లో TTD టాప్..
మరీ ముఖ్యంగా తలనీలాల నిల్వల్లో TTDయే టాప్. ఎందుకంటే ఇక్కడ తలనీలాల సమర్పణ అధికమొత్తంలో సాగుతుంది. కరోనా సీజన్ ను అలా ఉంచితే.. తిరుమలకు రోజూ 50 వేల మంది వరకూ భక్త జనం పోటెత్తుతుంటారు. వీరిలో ముప్పావు వంతు వరకూ తలనీలాలు సమర్పిస్తారు. దీంతో ఇక్కడ భారీ ఎత్తున నీలాల నిల్వ లభిస్తుంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో TTD బోర్డు లెక్కల ప్రకారం ఒక్క కళ్యాణకట్ట ద్వారానే దాదాపు 130 కోట్ల రూపాయల రాబడి అంచనా వేశారు. ఇక 2019లో 74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ప్రకటించింది TTD. ఇక 2006- 08 మధ్య అయితే అత్యధికంగా 250 కోట్ల రూపాయలను పొందగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. టికెట్లతోపాటూ తలవెంట్రుకల ద్వారా కూడా TTDకి ఆదాయం సమకూరుతున్నట్టుగా చెబుతున్నాయి గణాంకాలు.
పొడవు, వాటి రంగును బట్టి తల వెంట్రుకలను 5 గ్రేడులుగా విభజిస్తారు. జట్టు ఎంత ఎక్కువ పొడవుంటే అంత ఎక్కువ ధర వస్తుంది. దీన్నిబట్టీ తెలుసుకోవచ్చు.. తల నీలాల వెనక ఎంత ఆదాయముందో. అందుకే ఈ హెయిర్ మాఫియా.. అక్రమంగా తరలిస్తూ.. ఇంతగా తెగబడుతోంది.
ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..