AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana EAMCET: మరికాసేపట్లో విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి.

Telangana EAMCET Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను అధికారులు మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో...

Telangana EAMCET: మరికాసేపట్లో విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి.
Eamcet Results
Narender Vaitla
|

Updated on: Aug 25, 2021 | 7:39 AM

Share

Telangana EAMCET Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను అధికారులు మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి కేటాయించిన ర్యాంకులను ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. ఇక ఈ ఏడాది ఇంటర్‌ వెయిటేజీ లేని నేపథ్యంలో ఎంసెట్‌లో 70 నుంచి 80 మార్కులు వస్తే 10 వేల ర్యాంకుకు అటూఇటూగా వస్తుందని అంచనా వేస్తున్నారు. 30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inను సందర్శించాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉండే TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్‌ చేయాలి. * తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాలి. * చివరిగా సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read: Aadhaar Update: భారీ క్యూ లైన్‌లు.. తప్పని తిప్పలు.. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం రాత్రంతా అక్కడే.

Coronavirus: భారతీయులు సంక్రమణతో జీవించడం నేర్చుకుంటారు.. కరోనా ఏ దశలో చెప్పిన డబ్ల్యూహెచ్‌ఓ

Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం..వర్షాలు కురవాలని ఇలా చేస్తారట..