Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్..

Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి
Vidyadhan Scholarships
Follow us

|

Updated on: Aug 24, 2021 | 9:39 PM

Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది రూ.2 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఆర్థికంగా వెనుకబడి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఈ ‘విద్యాదాన్’ ఉపకార వేత నాలు అందజేస్తున్నట్టు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ వెల్లడించింది.

2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 90 శాతం సాధించాలని తెలిపింది.  సీజీపీఏ, దివ్యాంగ విద్యార్థులు కూడా అర్హులని తెలిపింది. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్/డిప్లొమా రెండేళ్ల చదువు నిమిత్తం ఏడాదికి రూ.6 వేల చొప్పున, అనంతరం ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువుల నిమిత్తం కోసం రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తామని ఫౌండేషన్ స్పష్టం చేసింది.

వచ్చే నెల 25న రాత పరీక్ష:

కాగా, దరఖాస్తులు చేసుకున్న వారికి వచ్చే సెప్టెంబర్‌ 25వ తేదీన రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి విద్యార్థులను ఉప కార వేతనాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది.

ఈ పత్రాలు తప్పనిసరి:

విద్యార్థులు 10వ తరగతి మార్కుల షీట్‌, ఒక వేళ ఇది అందుబటులో లేకపోతే ఎస్‌ఎస్‌ఎల్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి తాత్కాలిక మార్క్‌ షీట్‌ను అప్‌లోడ్‌ చేయవచ్చని సూచించింది. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, ఫోటో తప్పనిసరి.

స్కాలర్‌షిప్‌ కోసం ఏఏ రాష్ట్రాల విద్యార్థులు అర్హులంటే..

తెలంగా; ఆంధ్రప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని, లేదా 8367751309 నెంబర్‌కు సంప్రదించాలని సూచించింది.

ఇవీ కూడా చదవండి: Indian Railway Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక

Telangana Police Recruitment 2021: తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు