Telangana Police Recruitment 2021: తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
Telangana Police Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే గత నెలలోనే నోటిఫికేషన్..
Telangana Police Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల కాగా, దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4వ తేదీ వరకు గడువు ఉంది. ఈ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (TSLPRB)లో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి మల్టీజోన్ పోస్టులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
మొత్తం పోస్టులు: 151
మల్టీ జోన్-1 : 68 పోస్టులు (జనరల్ 27, బీసీ-ఏ 5, బీసీ-బీ 5, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 7, ఇతరులు 2) పోస్టులున్నాయి. మల్టీ జోన్-2 : 83 (జనరల్ 32, బీసీ-ఏ 7, బీసీ-బీ 7, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8, ఇతరులు 2) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 4, 2021 నాటికి రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 200 బహుళైచ్చిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి:
సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..