BOI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..! దరఖాస్తు చేసుకోండిలా

BOI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను..

BOI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..! దరఖాస్తు చేసుకోండిలా
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2021 | 12:43 PM

BOI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సపోర్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bankofindia.co.in ద్వారా దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి వివరాలు నమోదు చేసి ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 చివరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు బ్యాంకు అధికారులు. అయితే కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టారు.

అర్హతల వివరాలు..

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి, డిప్లొమో, గ్రాడ్యుయేషన్, BSW/BA/B.Com విద్యార్హతలను పొందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి. ఇతర వివరాలను నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డిమాన్స్ట్రేషన్/ప్రజంటేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:

ది జోనల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆగ్రా జోనల్ ఆఫీస్, సంజయ్ ప్యాలెస్, ఆగ్రా 282001. ఇందులో ఎంపికైన అభ్యర్థులు మెయిన్ పురి, కనౌజ్, ఫరూఖాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ అర్హతతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22..!

Inter Board: తెలంగాణలో ఇంటర్ కాలేజీల రేషనలైజేషన్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యా శాఖ అధికారులు