BECIL Recruitment: బీఈసీఐఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ.

BECIL Recruitment 2021: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

BECIL Recruitment: బీఈసీఐఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ.
Becil
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 21, 2021 | 6:55 PM

BECIL Recruitment 2021: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో బాగంగా మొత్తం 162 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (ఆగస్టు 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 162 ఖాళీలకు గాను సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ కోఆర్డినేటర్, సైంటిస్ట్, బయో మెడికల్‌ ఇంజనీర్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌(పీఆర్‌ఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. * అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు వివిధ పోస్టుల ఆధారంగా నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 22తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IAS, IPSల సెల్ఫ్ డబ్బా ఎక్కువైంది.. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాలు బ్యాన్ చేయాలని బీజేపీ ఎంపీ

Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, వైఎస్సార్ అక్కడి నుంచే ఎదిగారు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Realme C21Y: భారత మార్కెట్లోకి రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్‌.. ధర రూ. 10వేల లోపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా