AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ సర్వీస్‌కు తక్కువ సెల్ఫ్ డబ్బాకు ఎక్కువ.. IAS, IPSల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేయాలని బీజేపీ ఎంపీ డిమాండ్

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ చేసిన వ్యాఖ్యలు దుమారంరేపాయి. బ్యూరోక్రాట్స్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను, ఫ్యాన్ పేజ్‌లను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సోషల్ సర్వీస్‌కు తక్కువ సెల్ఫ్ డబ్బాకు ఎక్కువ.. IAS, IPSల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేయాలని బీజేపీ ఎంపీ డిమాండ్
Social Media
Janardhan Veluru
|

Updated on: Aug 21, 2021 | 6:54 PM

Share

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ చేసిన వ్యాఖ్యలు దుమారంరేపాయి. బ్యూరోక్రాట్స్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను, ఫ్యాన్ పేజ్‌లను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం సొంత డబ్బా కొట్టుకునేందుకు బ్యూరోక్రాట్స్ సోషల్ మీడియాను వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ సర్వీస్‌కు తక్కువ..సెల్ఫ్  ప్రమోషన్‌కి ఎక్కువ అన్నట్లు కొందరి వ్యవహారతీరు ఉందన్నారు.  కొందరు అధికారులైతే ప్రజాసేవ ఏమీ చేయకుండానే ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా తాము గొప్ప బ్యూరోకాట్స్‌గా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  బ్యూరోకాట్ల పేరుతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా అమాయక ప్రజలను మోసగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరు వ్యక్తిగత ఖాతాలు, ఫ్యాన్ పేజీలను బ్యాన్ చేయాలని కర్ణాటక ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ రమణా రెడ్డిని కోరారు.

మైసూరు-కొడగు ఎంపీ ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ నాయకులకు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలు ఉంటే లేని అభ్యంతరం..బ్యూరోక్రాట్స్‌కు ఉంటే ఎందుకని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్‌పైన ఉందని పేర్కొన్న నెటిజన్స్..కొందరి తీరు సోషల్ సర్వీస్‌కు తక్కువ సెల్ఫ్ ప్రమోషన్‌కి ఎక్కువ అన్నట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

Also Read..

Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్, వైఎస్సార్ అక్కడి నుంచే ఎదిగారు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Marijuana Effect:గంజాయి అధికంగా సేవిస్తే.. ఆ కౌంట్ తగ్గిపోతుందట..మానకపోతే ముప్పే అంటున్న నిపుణులు!