రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే తీవ్రమైన..అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఎవరికీ ప్రయోజనకారి కాడని, ఆయన ఓ 'బుల్' (ఎద్దు) వంటివాడని దాన్వే వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్
Rahul Gandhi
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 21, 2021 | 5:54 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే తీవ్రమైన..అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఎవరికీ ప్రయోజనకారి కాడని, ఆయన ఓ ‘బుల్’ (ఎద్దు) వంటివాడని దాన్వే వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో రాష్ట్ర మంత్రి భగవత్ కరాడ్ చేపట్టిన జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్న ఈయన.. రాహుల్ ఎవరికీ పనికి వచ్చే వ్యక్తి కాడని..బుల్ మాదిరి ఎక్కడబడితే అక్కడ తిరుగుతుంటాడని అన్నారు. 20 ఏళ్లుగా తాను లోక్ సభ ఎంపీగా ఉన్నానని, రాహుల్ పని తీరును చూశానని ఆయన చెప్పారు. మహారాష్ట్రలోనూ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ మగ లేగదూడలను ఆలయాలకు ‘కానుక;గా వదిలివేసే ఆచారం ఉంది. దాన్ని వ్యవసాయానికి గానీ..రవాణా లేదా ఇతర అవసరాలకు గానీ ప్రజలు వినియోగించరు. పొలాల్లో అది తమ గడ్డి మేసినా రైతులు అడ్డు చెప్పరు. దాన్ని క్షమించి వదిలేస్తారని రావు సాహెబ్ దాన్వే అన్నారు. అయితే ఇంతటి నోటి వాచాలత్వం ఉన్న ఈ మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ డిమాండ్ చేశారు. ఈ వ్యక్తిని కేబినెట్ లోకి ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. దాన్వేరైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

ఇక ఈ ఆశీర్వాద్ యాత్రలో ఈ కేంద్ర మంత్రి దాన్వే .. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయని.. ఆయన నాయకత్వంలో దేశం అద్వితీయంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. రైల్వే శాఖకు నిధులు లేనప్పటికీ ప్రభుత్వం తన ఖజానా నుంచి నిధులు వెచ్చిస్తూ ఈ శాఖను దిగ్విజయంగా నడిపిస్తోందన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Vikram: యాక్షన్ థ్రిల్లర్‏గా మహాన్.. నయా లుక్‏లో అదరగొట్టిన విక్రమ్..

Uttarakhand: నైనిటాల్ జిల్లాలో విరిగిపడిన కొండ చరియలు.. తృటిలో బస్సుకు తప్పిన ప్రమాదం