వైవిధ్యమైన సినిమాలతో తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు తమిల్ స్టార్ హీరో విక్రమ్. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. తన పాత్ర కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ హీరో. ఇక విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విక్రమ్. అపరిచితుడు సినిమా నుంచి ఐ చిత్రం వరకు తన పాత్ర కోసం తనను తాను మార్చుకుంటుంటాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విశేషమేంటంటే.. ఈ సినిమాలో హీరో విక్రమ్‌తో ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదిలా ఉంటే..తాజాగా విక్రమ్.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. విక్రమ్ కెరీర్లో 60వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీకి మహాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్లో విక్రమ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో విక్రమ్ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నాడు. బుల్లెట్ పై కూర్చున్న విక్రమ్ వెనకాల కొమ్ములు, 16 చేతులు గల ఒక ఆకారం కూడా కూర్చోని ఉంది. ఇక ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆసక్తిని కలిగిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిమ్రాన్, వాణి భోజన్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ట్వీట్..
#ChiyaanVikram in #Mahaan 🔥
A @karthiksubbaraj Padam#MahaanPosterReel https://t.co/wUUrir72e3#MahaanFirstLook #DhruvVikram @Music_Santhosh @kshreyaas @SimranbaggaOffc @actorsimha @vanibhojanoffl @7screenstudio @vivekharshan @SonyMusicSouth @tuneyjohn @proyuvraaj pic.twitter.com/AGZVwXpc6E
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2021
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
Manchu Manoj: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరో..
Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..