Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు ఇప్పటికే మొదలెట్టారు అభిమానులు. చిరు అభిమానులు ఇక ఇప్పటికే సోషల్ మీడియాను
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు ఇప్పటికే మొదలెట్టారు అభిమానులు. చిరు అభిమానులు ఇక ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రేపు ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం చిరు .. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందుల కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. రేపు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ రానున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత చిరు.. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమాను పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. కాసేపటి క్రితం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమా టైటిల్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ట్వీట్..
Presenting the Supreme Reveal of Megastar @KChiruTweets in a never seen before avatar as #GodFather?@jayam_mohanraja @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ @MusicThaman @sureshsrajan#Chiru153 #HBDMegaStarChiranjeevi pic.twitter.com/e9BYCwQz7b
— Konidela Pro Company (@KonidelaPro) August 21, 2021
Also Read: Manchu Manoj: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరో..
Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..
Enemy Movie: ఎనిమీ నుంచి పడదే సాంగ్.. శ్రోతలను మరోసారి ఆకట్టుకుంటున్న థమన్ మ్యూజిక్..