Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..

గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యంతో కనుమూశారు. ప్రస్తుతం

Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..
Nallennai Chitra
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2021 | 4:11 PM

గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అనారోగ్యంతో కనుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటి నల్లెనై చిత్ర (56) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లుగా కుటుంబసభ్యులు వెల్లడించారు. బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిత్ర.. 198-90లలో కన్నడ, తమిళ, తెలుగు భాషలలో అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ఊర్కావలన్, శరత్ కుమార్ నటించిన చేరన్ పాండియన్, ఎన్ తంగచి పడిచావ సినిమాలతో చిత్ర గుర్తింపు పొందింది.

1990లో విజయరాఘవను వివాహం చేసుకున్న చిత్ర ఆ తర్వాత పూర్తిగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. 1992లో ఈ జంటకు మహాలక్ష్మి అనే కుమార్తె జన్నించింది. ప్రస్తుతం సాలిగ్రామంలో నివసిస్తోన్న చిత్ర పలు సీరియల్స్‏లో నటిస్తోంది. చిత్ర ఆకస్మిక మృతి పట్ల చిత్రపరిశ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖు చిత్ర మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం చిత్ర అంత్యక్రియలను సాలి గ్రామంలో నిర్వహించనున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: Enemy Movie: ఎనిమీ నుంచి పడదే సాంగ్.. శ్రోతలను మరోసారి ఆకట్టుకుంటున్న థమన్ మ్యూజిక్..

Prabhas: ప్రభాస్‌తో నేను పెళ్లికి సిద్ధం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Allu Arjun in AHA Office: ఆహా కొత్త ఆఫీసులో తళుక్కుమన్న అల్లు అర్జున్‌.. వైరల్‌ అవుతోన్న బన్నీ నయా లుక్‌.

Young Tiger Jr. NTR : తారక్‌ అన్న స్టైల్లోనూ తోపే… ఫ్యాన్స్‌ రీసౌండ్‌ స్టేట్‌మెంట్… దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా…!