Prabhas: ప్రభాస్‌తో నేను పెళ్లికి సిద్ధం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.
Prabhas: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జాబితాలో డార్లింగ్ ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు. బాహుబలి సినిమాతో...
Prabhas: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జాబితాలో డార్లింగ్ ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారారు ప్రభాస్. దీంతో పాటే ఆయన ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. హాలీవుడ్ హీరోను తలదన్నే రూపంతో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్‌గా మారారీ డార్లింగ్. ఇక కేవలం యాక్షన్ చిత్రాలతోనే కాకుండా డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ తాజాగా.. రాధే శ్యామ్ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్న ప్రభాస్‌కు లేడీ ఫాలోయింగ్ కూడా తక్కువేం లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
ఇక ప్రభాస్ వివాహానికి సంబంధించి ఎప్పుడూ ఏదో వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ యంగ్ రెబల్ స్టార్ మాత్రం చిరు నవ్వుతో సమాధానం చెబుతూ తన సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక హీరోయిన్లలో కూడా చాలా మంది ప్రభాస్‌ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతీ.. ‘‘ప్రభాస్.. టైగర్ ష్రాఫ్.. కార్తీక్ ఆర్యన్’ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌చేస్తారు?’ అని ప్రశ్నించగా.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని, టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్ చేస్తానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే కృతీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో దేశంలోని దాదాపు అన్ని భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నా విషయం తెలిసిందే. మరి ప్రభాస్ తన పెళ్లికి సంబంధించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పనున్నాడో చూడాలి.
Also Read: Nani: హీరో నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్.. అపాలజీ లెటర్ రిలీజ్.. కారణమిదే..
Allu Arjun AHA Office: ఆహా ఆఫీసులో తళుక్కుమన్న అల్లు అర్జున్.. వైరల్ అవుతోన్న బన్నీ కొత్త లుక్.
Happy Birthday Bhumika : విశాలమైన కళ్ళు .. విచ్చుకున్న పూరేకులంటి పెదాలు.. ఆమె అందం వర్ణనాతీతం