Nani: హీరో నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్.. అపాలజీ లెటర్ రిలీజ్.. కారణమిదే..

నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ ఓనర్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారీ చిత్రాన్ని థియేటర్లలో

Nani: హీరో నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్.. అపాలజీ లెటర్ రిలీజ్.. కారణమిదే..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2021 | 2:54 PM

నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ ఓనర్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారీ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ యాజమానులు చిత్రయూనిట్ పై, నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి టక్ జగదీష్ టీంతోపాటు, హీరో నానిపై విమర్శలు గుప్పించారు. నానికి భవిష్యత్తు ఏంటో చూపిస్తామని.. కేవలం సినిమాల్లోనే హీరో అని… నిజ జీవితంలో పిరికివాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో హీరో నానితోపాటు.. చిత్రయూనిట్ పై విమర్శలు చేస్తున్న థియేటర్ ఓనర్స్ పై ఇండస్ట్రీ నుంచి పలు విమర్శలు వచ్చాయి. దీంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది.

లవ్ స్టోరీ-టక్ జగదీష్ నడుమ నెలకొన్న వివాదం గురించి పూర్తిగా వివరిస్తూ.. ఈ క్రమంలోనే ఎవరినైనా ఎగ్జిబిటర్లు వారి వారి వ్యక్తిగత హోదాలో ఎవరినైనా విమర్శించి ఉంటే క్షమించాలి అంటూ అపాలజీ లెటర్‏ను విడుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇక ఇటీవల థియేటర్లలో విడుదలైన తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అదే రోజున ఓటీటీలో నాని టక్ జగదీష్ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో శుక్రవారం ఫిలిం ఛాంబర్‏లో తెలంగాణ థియేటర్ ఓనర్స్ ప్రెస్ మిట్ నిర్వహించారు. ఆ మీటింగ్‏లో ఇద్దరు సభ్యులు నాని పై విమర్శలు చేశారు. దీంతో వాటిపై ఇండస్ట్రీ నుంచి విమర్శలు రావడంతో ఈరోజు తెలంగాణా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అపాలజీ లెటర్ రిలీజ్ చేసింది. ఎగ్జిబిటర్లు వారి వారి వ్యక్తిగత హోదాలో ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించి వుంటే క్షమించాలి అంటూ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అపాలజీ లెటర్‏ను విడుదల చేసింది.

Also Read: మెగాస్టార్ తనయ నిర్మాణంలో మరో మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‏లుక్.. ఇంతకీ సినిమా పేరెంటో తెలుసా…

Happy Birthday Bhumika : విశాలమైన కళ్ళు .. విచ్చుకున్న పూరేకులంటి పెదాలు.. ఆమె అందం వర్ణనాతీతం

Young Tiger Jr. NTR : తారక్‌ అన్న స్టైల్లోనూ తోపే… ఫ్యాన్స్‌ రీసౌండ్‌ స్టేట్‌మెంట్… దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా…!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!