మెగాస్టార్ తనయ నిర్మాణంలో మరో మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‏లుక్.. ఇంతకీ సినిమా పేరెంటో తెలుసా…

మెగాస్టార్ తనయ నిర్మాణంలో మరో మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‏లుక్.. ఇంతకీ సినిమా పేరెంటో తెలుసా...
Sridevi Shoban Babu

స్టార్ హీరోల వారసులే కాదు.. వారసురాల్లు కూడా సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పటికే కమల్ హసన్, మోహన్ బాబు, నాగబాబు కూతుర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో

Rajitha Chanti

|

Aug 21, 2021 | 2:24 PM

స్టార్ హీరోల వారసులే కాదు.. వారసురాల్లు కూడా సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పటికే కమల్ హసన్, మోహన్ బాబు, నాగబాబు కూతుర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భర్త విష్ణు ప్రసాద్‏తో కలిసి సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్‏టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిర్మించి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను నిర్మిస్తుంది.

Sridevi

Sridevi

రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‏లుక్ పోస్టర్‏తోపాటు, టైటిల్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఏక్ మినీ కథతో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ఇందులో సంతోష్ శోభన్ సరసన జాను ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్‎గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన శ్రీదేవి శోభన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో గౌరీ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఉండగా.. సంతోష్ మాత్రం ఫార్మర్ షర్ట్ లో రఫ్ గడ్డంతో మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ – సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Happy Birthday Bhumika : విశాలమైన కళ్ళు .. విచ్చుకున్న పూరేకులంటి పెదాలు.. ఆమె అందం వర్ణనాతీతం

Megastar Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే కు మెగా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మెహర్ రమేష్..

Young Tiger Jr. NTR : తారక్‌ అన్న స్టైల్లోనూ తోపే… ఫ్యాన్స్‌ రీసౌండ్‌ స్టేట్‌మెంట్… దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా…!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu