AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే కు మెగా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మెహర్ రమేష్..

మెగాస్టార్‌ బర్త్‌డే అంటే హంగామా ఎలా ఉంటుంది చెప్పండి.. సోషల్ మీడియా అకౌంట్లో కామన్‌ డీపీలు.. బయట పెద్ద పెద్ద బ్యానర్లు..! చిరు సినిమాలు, పాటలు,

Megastar Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే కు మెగా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మెహర్ రమేష్..
Chiru
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2021 | 1:16 PM

Share

Megastar Chiranjeevi Birthday : మెగాస్టార్‌ బర్త్‌డే అంటే హంగామా ఎలా ఉంటుంది చెప్పండి.. సోషల్ మీడియా అకౌంట్లో కామన్‌ డీపీలు.. బయట పెద్ద పెద్ద బ్యానర్లు..! చిరు సినిమాలు, పాటలు, ప్రోగ్రామ్‌లతో టీవీల్లో సందడులు.. బైక్‌ ర్యాలీలు, బ్లడ్ డొనేషన్లు… అన్నదానాలు.. సేవా కార్యక్రమాలతో ఫ్యాన్స్‌ గింగిరాలు..! ఇలా తీరిక లేకుండా.. పండుగలా..బాస్ బర్త్‌ డే వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతాయి. అయితే ఈ సారి వీటన్నింటి సంగతి పక్కన పెడితే.. తన బర్త్‌డేకు మూడు మొక్కలు నాటాలంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఓ మెసేజ్‌ను ఇచ్చారు. ముగ్గురికి సాయం చేయాలన్న స్టాలిన్‌ సినిమా ప్రిన్సిపుల్‌ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి… తన బర్త్‌ డేకు తన ఫ్యాన్స్‌ అండ్ వెల్విషర్స్‌ మూడు మొక్కలు నాటాలని చిరు కోరారు. చిరు మొక్కలను నాటమని చెప్పడమే కాదు ‘హరాహైతో బరా హై’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ క్యాంపెయిన్‌లో అందరూ బాగస్వామ్యం కావాలని కోరారు. అంతే కాదు ఈ ట్వీట్ ను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కారకుడు ఎంపీ సంతోష్ కుమార్‌ కు ట్యాగ్ చేశారు. దాంతో ఫ్యాన్స్ మొక్కలు నాటేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ బర్త్ డే రోజున ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు డైరెక్టర్లు. ఇప్పటికే ఆచార్య నుంచి అరిరిపోయే గిఫ్ట్ రెడీ అవుతుంది అలాగే లూసిఫర్ రీమేక్ మూవీ నుంచి టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డేకు కనుక ఇవ్వాలని మెహర్ రమేష్ కూడా సిద్ధం అవుతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రొడక్షన్ నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిరూ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22 ఉదయం 9 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సినిమా తమిళ్‌లో సూపర్ హిట్ అయిన అజిత్ నటించిన వేదాళం మూవీ రీమేక్‌గా రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishnu Manchu: త్వరలోనే మా సభ్యులకు గుడ్ న్యూస్ చేప్తానంటున్న మంచు హీరో.. వీడియో షేర్ చేసిన విష్ణు..

Bheemla Nayak: షూటింగ్ బ్రేక్‌లో పవన్ ఏంచేస్తున్నాడో చూడండి.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్..

Megastar Chiranjeevi: అభిమానులకు మెగాస్టార్ పిలుపు.. తన బర్త్ డే రోజు ఇలా చేయండంటూ ఫ్యాన్స్‌కు చిరు విజ్ఞప్తి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..