Vishnu Manchu: త్వరలోనే మా సభ్యులకు గుడ్ న్యూస్ చేప్తానంటున్న మంచు హీరో.. వీడియో షేర్ చేసిన విష్ణు..

టాలీవుడ్‌లో మా ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. గత పాలకవర్గం సమయం ముగుస్తున్న నేఫథ్యంలో.. కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు జరగాల్సిఉంది. కాని ఇప్పటివరకు మా అసోసియేషన్‌

Vishnu Manchu: త్వరలోనే మా సభ్యులకు గుడ్ న్యూస్ చేప్తానంటున్న మంచు హీరో.. వీడియో షేర్ చేసిన విష్ణు..
Vishnu
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2021 | 12:24 PM

Vishnu Manchu: టాలీవుడ్‌లో మా ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. గత పాలకవర్గం సమయం ముగుస్తున్న నేఫథ్యంలో.. కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు జరగాల్సిఉంది. కాని ఇప్పటివరకు మా అసోసియేషన్‌ నుంచి గాని.. అసోసియేషన్‌ పెద్దల నుంచి గాని ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ.. ప్రస్తుత పాలకవర్గానికి వ్యతిరేకంగా ప్రకాష్‌రాజ్‌ ఓ ప్యానల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులను ప్యానల్‌ ప్రకటించారు. మా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. ఇక ప్రకాష్‌రాజే  తర్వాతి మా అధ్యక్షుడు అంటూ అంతా ప్రచారం జరిగింది. కాని ఉన్నట్లుండి సీన్‌లోకి మంచు విష్ణు ఎంటరై సమీకరణాలు మార్చేశారు. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ 27 మందితో ప్యానల్‌ను ప్రకటించారు. ఆ వెంటనే హీరో మంచు విష్ణు తాను కూడా పోటీచేస్తానని ప్రకటించారు. మంచు విష్ణు మా అసోసియేషన్‌కు‌ సొంత బిల్డింగ్ నిర్మించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన సొంత డబ్బులతో బిల్డింగ్ ను నిర్మిస్తానని విష్ణు ఇప్పటికే ప్రకటించారు. .

మా ఎన్నికల బరిలో నిలబడతాననిప్రకటించిన మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఓ ప్రత్యేక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే తన జేబులోంచి డబ్బులు పెట్టి భవంతిని కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ… తన హామీలు ఉత్తవి కావని నిరూపించేందుకు విష్ణు సంచలన ప్రకటన చేశారు. మా బిల్డింగ్‌ కోసం మూడు స్థలాలు చూశానన్నారు. వాటిలో ఏది బెస్టో అందరం కలిసి డిసైడ్‌ చేద్దామంటూ ఓ వీడియోని ట్వీట్‌ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NTR 30 Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం.. కారణం ఇదే.. నిరాశలో ఫ్యాన్స్

Mega Family: మెగాస్టార్ చిరంజీవి ఇంట శ్రావణ శోభ.. మెగా ఫ్యామిలీ నాలుగు తరాల ఫోటో వైరల్

Sushanth : ‘బండి తియ్’ అంటున్న అక్కినేని హీరో.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి ప్రమోషనల్ సాంగ్